Uma Maheswara Ugra Roopasya Movie Review: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీ రివ్యూ..
Uma Maheswara Ugra Roopasya Movie Review: మేకింగ్ కంప్లీట్ అయిపోయిన చాలా సినిమాలు లాక్ డౌన్ వలన విడుదల కాలేకపోయాయి. అలాంటి చిత్రలాన్ని ఇప్పుడు
Uma Maheswara Ugra Roopasya Movie Review: మేకింగ్ కంప్లీట్ అయిపోయిన చాలా సినిమాలు లాక్ డౌన్ వలన విడుదల కాలేకపోయాయి. అలాంటి చిత్రలాన్ని ఇప్పుడు ఓటీటీ ద్వారా విడుదలవుతున్నాయి. అందులో భాగంగానే ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి అంచనాలను పెంచిన సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఈ చిత్రం నేడు నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది.
మలయాళంలో మంచి హిట్ అయిన 'మహేశ్ ఇంటే ప్రతికారం' చిత్రాన్ని తెలుగులోకి 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'గా రీమేక్ చేశారు. ఇందులో సత్యదేవ్ మెయిన్ లీడ్ లో నటించగా, 'కేరాఫ్ కంచరపాలెం' ఫేం వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మన రివ్యూలో చూద్దాం..
కథ :
ఉమామహేశ్వరరావు (సత్యదేవ్) అరకులో ఓ మంచి ఫొటోగ్రాఫర్.. ఆ ఊళ్లో అతనొక్కడే ఫొటోగ్రాఫర్.. దీనితో ఎలాంటి కార్యక్రమానికైనా సరే అతనినే పిలుస్తారు. ఇక గొడవలు అంటే భయం ఉన్న ఉమామహేశ్వరరావు ఒకరోజు గొడవను ఆపడానికి వెళ్లి అక్కడ దెబ్బలు తింటాడు. దీనితో పరువు పోయిందని భావించిన ఉమామహేశ్వరరావు తనని కొట్టినవాడిని తిరిగి కొట్టేవరకు మళ్లీ చెప్పులు వేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. అయితే అతని ప్రతీకారం ఎలా తీరింది. ఇందులోకి అతను ప్రేమించిన అమ్మాయి హరిచందన ఎందుకు వచ్చింది అంటే సినిమా చూడాల్సిందే..
ఎలా ఉందంటే?
ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ డైరెక్టర్ వెంకటేశ్ మహా అనే చెప్పాలి. మలయాళ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ ఆ ఫీల్ మాత్రం ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా సినిమాని తెరకెక్కించాడు. ప్రతి పాత్రను చాలా సహజంగా చూపించాడు. మొదటిభాగంలో ఎక్కువగా కాలక్షేపం చేయకుండా డైరెక్ట్ గా కథను మొదలుపెట్టాడు దర్శకుడు.. ఫొటోగ్రాఫర్‌గా ఉమామహేశ్వరరావు జీవితాన్ని, స్వాతి(హరిచందన )తో ప్రేమ సన్నివేశాలతో ఫస్ట్ ఆఫ్ ని ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా నడిపించాడు.
ఇక మహేష్ తన్నులు తినడం, ఆ తరవాత ప్రతిజ్ఞ చేపట్టడంతో కథ కీలక మలుపు తిరుగుతుందనుకున్న ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. అప్పటివరకూ ఒక ప్లాట్ పైన నడిచిన కథ వేరే వైపు మళ్ళుతుంది. ఆ అమ్మాయిని ప్రేమించడం, వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి కాస్త విసుగు తెప్పిస్తాయి. ఇక చివర్లో మహేష్ ఎలా ప్రతీకారం తీర్చుకున్న విధానాన్ని మాత్రం చాలా సాధారణంగా తెరకెక్కించాడు దర్శకుడు.
ఎవరెలా చేశారంటే?
ఉమామహేశ్వరరావు పాత్రకు వందకి వంద శాతం న్యాయం చేశాడు సత్యదేవ్.. అమాయకంగా కనిపించడమే కాక ఉగ్ర రూపంలోనూ దర్శనమిస్తూ నవరసాలు పలికించాడు. ఇక స్వాతి పాత్రలో హరిచందన జ్యోతి పాత్రలో రూప బాగా ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రలలో వారివారి పరిధి మేరకు ఒదిగిపోయారు.
సాంకేతిక వర్గం :
సినిమా ఎక్కువ భాగం అరకు ప్రాంతంలో కావడంతో అప్పు ప్రభాకర్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయింది. చాలా అందాలను తన కెమరాలో బంధించాడు. బిజిబల్ అందించిన సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక రవితేజ గిరిజాల సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలకి తన కత్తెరకు ఇంకాస్త పని చెబితే బాగుండు అనిపిస్తుంది.