Tollywood: రిలీజ్‌లో రూ. 10 కోట్లు.. రీరిలీజ్‌లో ఏకంగా రూ. 34 కోట్లు.. కాసుల వర్షం కురిపించిన హర్రర్ సినిమా..!

Tumbbad Movie: ప్రస్తుతం తెలుగులో రీరిలీజ్‌ల సందడి కొనసాగుతోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు మరోసారి థియేటర్లలో విడుదల అవుతున్నాయి.

Update: 2024-10-10 14:00 GMT

Tollywood: రిలీజ్‌లో రూ. 10 కోట్లు.. రీరిలీజ్‌లో ఏకంగా రూ. 34 కోట్లు.. కాసుల వర్షం కురిపించిన హర్రర్ సినిమా..!

Tumbbad Movie: ప్రస్తుతం తెలుగులో రీరిలీజ్‌ల సందడి కొనసాగుతోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు మరోసారి థియేటర్లలో విడుదల అవుతున్నాయి. అలాగే, కొన్నిసార్లు ఫెయిల్ అయిన సినిమాలను మరోసారి రిలీజ్ చేశారు. అయితే, రీరిలీజ్‌లో మాత్రం అద్భుతంగా ఆకట్టుకున్నాయి. రీరిలీజ్‌లో ఏకంగా రూ.10 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి, షాక్ ఇచ్చాయి. రీరిలిజ్‌ల హవా టాలీవుడ్‌తోపాటు తమిళంలోనూ కొనసాగుతుంది. అయితే, తాజాగా ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందరి అంచనాలను మించి ఓ చిన్న సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అదే తుంబాడ్ సినిమా.

అక్టోబర్ 2018లో విడుదలైన తుంబాడ్ భారీ విజయాన్ని సాధించింది. హార్రర్ డ్రామాగా విడుదలైన ఈ సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. చిన్న సినిమాగా విడుదలై.. కాసుల వర్షం కురిపించింది. అయితే, ఈ సినిమా సౌత్‌లో అంత పేరు తెచ్చుకోలేదు. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఇక్కడ కూడా రెస్పాన్స్ అంతగా రాలేదు. ఈ క్రమంలో రీరిలీజ్‌ల ట్రెండ్‌లో భాగంగా తుంబాడ్‌ని రిలీజ్ చేశారు.

ఈ సినిమాను సెప్టెంబర్ లో దేశమంతా రీరిలీజ్ చేశారు. హార్రర్ అడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి ఈ సినిమా రిలీజైనప్పుడు రూ.16 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. కానీ, రీరిలీజ్‌లో మాత్రం ఏకంగా రూ.32 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. దీంతో ఒక్కసారిగా సినిమా ప్రపంచాన్ని షేక్ చేసింది.

Tags:    

Similar News