Rajamouli: రాజమౌళి, మహేష్‌ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది అప్పటి నుంచే.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌..

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి, మహేహ్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-10 08:10 GMT

Rajamouli: రాజమౌళి, మహేష్‌ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది అప్పటి నుంచే.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌..

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి, మహేహ్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ట్రిపులార్‌ చిత్రంతో ప్రపంచం దృష్టిని తనవైపు ఆకర్షించిన రాజమౌళి ఇప్పుడు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో ఎలాంటి వండర్‌ క్రియేట్‌ చేయనున్నాడని అందరి దృష్టి పడింది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి రాజమౌళి ఏం చేయనున్నాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అయితే చిత్ర యూనిట్‌ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క అధికారిక ప్రకటన కూడా చేయాలేదు. అడపాదడపా మహేష్‌ బాబు లాంగ్‌ హెయిర్‌లో ఉన్న కొత్త లుక్‌లో కనిపించడం తప్ప ఈ సినిమా టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. ఇక సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై కూడా ఎలాంటి ప్రకటన రాలేదు.

అయితే తాజాగా రాజమౌళి తండ్ర, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అందరూ అనుకుంటున్నట్లుగానే జనవరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా కథ రాయడానికే దాదాపు రెండేళ్లు పట్టిందని, అద్భుతమైన కంటెంట్‌ తో సినిమా రాబోతున్నదని పేర్కొన్నారు.

దీంతో విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో సినీ లవర్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను పాన్‌ వరల్డ్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలిసిందే. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు హాలీవుడ్‌ నటులు కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Tags:    

Similar News