Horror Movie: బడ్జెట్ రూ.40 కోట్లు.. లాభం రూ. 100 కోట్లపైనే.. జనాలను భయపెడుతూనే కాసుల వర్షం కురిపించిన హర్రర్ సినిమా..!
Must Watch Horror Movie OTT: నిద్రలేని రాత్రులు ఇచ్చే హారర్ సినిమా కోసం మీరు వెతుకుతున్నారా.. అయితే, ఈ సినిమా మీరు తప్పక చూడాల్సిందే.
Must Watch Horror Movie OTT: నిద్రలేని రాత్రులు ఇచ్చే హారర్ సినిమా కోసం మీరు వెతుకుతున్నారా.. అయితే, ఈ సినిమా మీరు తప్పక చూడాల్సిందే. ఒంటరిగా చూస్తే మాత్రం కచ్చితంగా భయపడతారంతే. ఈ హారర్ సినిమాలో కథతోపాటు పాత్రలు కూడా ఎంతో బలమైనవి. ఇందులో మీ హార్ట్ బీట్‌ని పెంచే సీన్స్ ఎన్నో ఉన్నాయి.
ఈ సినిమాని ఎప్పుడు చూసినా ఒంటరిగా మాత్రం చూడకండి. చీకట్లో మాత్రం అస్సలు చూడకండి. మీ చుట్టూ లైట్లు తప్పనిసరిగా ఉండేలా చేసుకోవడం చాలా మంచిది. లేదంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యాక ఒక్క నిమిషం కుర్చీలోంచి లేవడానికి కూడా వణుకు పుట్టేలా చేస్తుంది. ఈ సినిమా పేరు 'అరణ్మనై 4'.
ఈ సినిమా కథ ఒక పూజారి ఇంటి నుంచి మొదలవుతుంది. ఆ పూజారి చాలా ఏళ్లుగా జరగాల్సిన పూజకు తన కూతురిని తీసుకెళ్తుంటాడు. కూతుర్ని పడవలో కూర్చోబెట్టి పూజ వెనుక ఉన్న కథ చెబుతుంటాడు. ఒక దుష్టాత్మను చాలా మంది పట్టుకున్నారని, ఆ ఆత్మ మనుషులను చంపి వారి రూపం దాల్చి మిగిలిన వారిని చంపేస్తుందంటూ చెప్తాడు.
అప్పుడే పూజారి కూతురు నది నీళ్లతో ఆడుకుంటుంది. మరోవైపు, పూజారి తెడ్డు నదిలో చిక్కుకుంటుంది. అతను తెడ్డును గట్టిగా లాగిన వెంటనే, దుష్టాత్మను కట్టి నీటిలో విసిరిన కలశం పగిలిపోతుంది. పూజారి కుమార్తె ఆడుకుంటున్న సమయంలో గాయపడుతుంది. ఆమె రక్తం నీటిలో కలుస్తుంది. ఆ ఆత్మ కూతుర్ని చంపి ఆమె రూపాన్ని తీసుకుంటుంది.
పూజారి విషయం తెలిసిన వెంటనే, అతను ఆత్మను బంధిస్తాడు. ఆ తర్వాత ఆత్మను తన కూతురిగా చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. ఆ తర్వాత సినిమా కథ ముందుకు సాగుతుంది. తమన్నా భాటియా తన సంతోషకరమైన కుటుంబంతో జీవిస్తోంది. అప్పుడు ఆ దుష్టాత్మ ఆమె భర్తను చంపి తన కూతురిని కూడా చంపాలనుకుంటోంది. కానీ, ఆమె ఎలాగోలా తన కూతురిని కాపాడుతుంది. తమన్నా చనిపోతుంది.
ఈ కథలోని ట్విస్ట్, మరణాల మధ్య సంబంధం చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే, చాలా సన్నివేశాలు గుండె వేగాన్ని పెంచేస్తాయి. వీటిని చూస్తే.. కచ్చితంగా భయపడతారు. ఓటీటీలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియా కథనాల ప్రకారం ఈ తమిళ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 40 కోట్లు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు వసూలు చేసింది. 2024 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.