Box Office: కేవలం 5 కోట్లతో తెరకెక్కిన సినిమా.. రీరిలీజ్‌లో 38 కోట్లు రాబట్టింది..!
Box Office: ప్రస్తుతం రీరిలీజ్‌ల హవా నడుస్తోంది. ఒకప్పుడు విడుదలై ప్రేక్షకులను అలరించిన చిత్రాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం ఇప్పుడొక ట్రెండ్‌గా మారింది.
Box Office: ప్రస్తుతం రీరిలీజ్‌ల హవా నడుస్తోంది. ఒకప్పుడు విడుదలై ప్రేక్షకులను అలరించిన చిత్రాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం ఇప్పుడొక ట్రెండ్‌గా మారింది. హీరోల పుట్టిన రోజు, సిల్వర్ జూబ్లీ.. ఇలా రకరకాల ఈవెంట్స్‌ను పురస్కరించుకొని సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. అయితే తొలిసారి థియేటర్లలో విడుదలైన సమయంలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోని ఒక సినిమా రీరిలీజ్ సమయంలో మాత్రం సంచలనం సృష్టించింది. ఇంతకీ ఏంటా సినిమా? అందులో ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తుంబాద్ అనే బాలీవుడ్ మూవీ 2017లో థియేటర్లలో విడుదలైంది. ఈ బాలీవుడ్ మూవీ థియేటర్లలో విడుదలైన సమయంలో రూ. 15 కోట్లు రాబట్టింది. అయితే ఇన్నేళ్ల తర్వాత తాజాగా సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను మళ్లీ విడుదల చేశారు. మొదటిసారి విడుదలైన సమయంలో రూ. 15 కోట్లు మాత్రమే రాబట్టిన ఈ సినిమా రీరిలీజ్‌లో మాత్రం రికార్డు కలెక్షన్లను రాబట్టడం విశేషం. ఈ సినిమ ఏకంగా రూ. 38 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
రీరిలీజ్ మూవీస్‌లో ఇప్పటి వరకు దళపతి విజయ్ పేరు మీద ఉన్న గిల్లీ మూవీ రికార్డును తుంబాద్ బ్రేక్ చేసింది. ఈ హారర్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 100 ఏళ్లలో ఎవరూ వెళ్లని లోకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించడం విశేషం. హారర్ సినిమాలకు ఫాలోయింగ్ పెరగడమే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడానికి కారణంగా చెబుతున్నారు. కాగా తుంబాద్ మూవీకి ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రీరిలీజ్ మూవీగా తుంబాద్ రికార్డ్ సెట్ చేసినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత రూ. 32.5 కోట్లతో గిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇక టైటానిక్ రూ.18 కోట్లు, షోలే 3డీ వెర్షన్ రూ.13 కోట్లు, లైలా మజ్నూ రూ.11.5 కోట్లు, రాక్‌స్టార్ రూ.11.5 కోట్లు, అవతార్ రూ.10 కోట్లు వసూలు చేశాయి. తెలుగు సినిమాల విషయానికొస్తే.. మురారి మూవీ రూ.8.9 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ రూ.8.01 కోట్లు, ఖుషీ రూ.7.46 కోట్లు, బిజినెస్‌మ్యాన్ రూ.5.85 కోట్లు, సింహాద్రి రూ.4.6 కోట్లు, ఇంద్ర రూ.3.38 కోట్లు వసూలు చేశాయి.