Actress: ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తు పట్టారా.? ఒకప్పుడు కుర్రాల హృదయాలను కొల్లగొట్టిందీ బ్యూటీ..!
Actress: హీరోయిన్ల హవా ఇండస్ట్రీలో కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Actress: హీరోయిన్ల హవా ఇండస్ట్రీలో కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని బ్లాక్ బస్టర్ మూవీస్‌ను అందించినా.. ఒకటి రెండు ఫ్లాప్‌లు వస్తే చాలు అకాశాలు తగ్గుతాయి. ఇక మరి కొందరు అవకాశాలు వస్తున్నా నెమ్మదిగా తెరకు దూరమవుతుంటారు. అలాంటి ఎంతో మంది నటీమణులు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి దూరమైనా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తాజాగా అలాంటి ఓ హీరోయిన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పైన కనిపిస్తున్న ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.? ఈ జనరేషన్ వాళ్లకు కాస్త కష్టమే కానీ. ఒక 20 ఏళ్ల క్రితం వారికి మాత్రం ఇట్టే తెలిసిపోతుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీల్లో నటించి ప్రేక్షకులను ఎంతో మెప్పించిందీ బ్యూటీ. తరుణ్ సరసన నటించి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఈ బ్యూటీ నటించిన సినిమాలు టీవీల్లో వస్తే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఇంతకీ ఈ చిన్నది ఎవరో ఇప్పటికే మీకు ఓ ఐడియా వచ్చే ఉంటుంది కదూ! అవును మీ గెస్ కరెక్టే.. ఈ హీరోయిన్ మరెవరో కాదు రిచా పల్లోడ్.
ఒకప్పుడు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ చిన్నది ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటోంది. నువ్వే కావాలి మూవీతో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న రిచా.. హోలీ, చిరుజల్లు, ప్రేమతో రా, నా మనసిస్తా రా, పెళ్లాం పిచ్చోడు, ఇంకోసారి ఇలా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. సినిమాల నుంచి దూరమైన తర్వాత రిచా.. 2011లో హిమాన్షు బజాజ్ అనే బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకుంది.
ఈ జంటకు ఒక కుమారుడు ఉన్నాడు. కాగా 2016లో మరోసారి సిల్వర్ స్క్రీన్కు ఎంట్రీ ఇచ్చింది రిచా. ఆది పనిశెట్టి నటించిన మలుపు మూవీలో స్పెషల్ పాత్రలో నటించింది. అయితే తెలుగులో మాత్రం స్ట్రెయిట్ మూవీ చేయలేదు. ఇక సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్ అప్డేట్స్ను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.