Bigg Boss 8 Telugu: స్మోకింగ్ చేస్తూ చిక్కిన విష్ణుప్రియ.. వైరల్‌ అవుతోన్న వీడియో

Bigg Boss 8 Telugu: తాజాగా విష్ణు ప్రియ స్మోకింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను గమనిస్తే.. కార్నర్‌లో కూర్చున్న విష్ణు ప్రియ దమ్ముకొడుతున్న వీడియో, ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

Update: 2024-10-10 04:50 GMT

Bigg Boss 8 Telugu: స్మోకింగ్ చేస్తూ చిక్కిన విష్ణుప్రియ.. వైరల్‌ అవుతోన్న వీడియో

Bigg Boss 8 Telugu: పొగతాగడం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాగే సిగరెట్ పెట్టెపై కూడా ఈ విషయాన్ని తెలుపుతారు. అయినా పొగరాయుళ్లు మాత్రం ఆ అలవాటును మానుకోరు. అయితే కేవలం పురుషులకే పరిమితం కాకుండా మహిళలు కూడా ఇటీవల స్మోకింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ హౌజ్‌లో పొగరాయుళ్ల కోసం ప్రత్యేకంగా స్మోకింగ్‌ జోన్‌ కూడా ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే.

స్మోకింగ్ చేయాలనుకునే వారు సదరు జోన్‌లోకి వెళ్లి స్మోక్‌ చేస్తుంటారు. అయితే అప్పటి వరకు వాళ్లు స్మోకింగ్ చేస్తున్నారన్న విషయం ప్రపంచానికి తెలియకపోయినా.. బిగ్‌బాస్‌ పుణ్యామాని అందరికీ తెలిసిపోతుంది. ఇప్పటి వరకు జరిగిన సీజన్స్‌లో పలువురు పొగరాయుళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరుగుతోన్న 8వ సీజన్‌లో విష్ణు ప్రియ కూడా ఇలా స్మోకింగ్ చేస్తూ కెమెరాకు చిక్కింది.

ఇటీవల హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన సోనియా మాట్లాడుతూ.. హౌజ్‌లో కొందరు మహిళలు కూడా సిగరెట్ తాగుతారు అంటూ సంచలన కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఓ లేడీ కంటెస్టెంట్‌ అయితే ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్‌ తాగుతా అంటే.. నేనే మంచిది కాదని చెప్పి మరీ ఆపేశాను. అయితే ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం చెప్పను’ అంది సోనియా.

దీంతో ఆ లేడీ కంటెస్టెంట్ ఎవరనీ అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విష్ణు ప్రియ స్మోకింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను గమనిస్తే.. కార్నర్‌లో కూర్చున్న విష్ణు ప్రియ దమ్ముకొడుతున్న వీడియో, ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. కాగా విష్ణుప్రియకు స్మోకింగ్ అలవాటు ఉందని శేఖర్‌ బాషా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.


Tags:    

Similar News