AR Rahman, Saira Banu Divorce : రెహమాన్ టీమ్‌లోని మోహినీ డే ఎవరు? ఆమె గురించి చర్చ ఎందుకు మొదలైంది?

Update: 2024-11-21 03:37 GMT

AR Rahman, Saira Banu Divorce: లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ 29ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకడంతో సోషల్ మీడియా అంతా కూడా ఈ వార్తే చక్కర్లు కొడుతోంది. అయితే విడాకులు తీసుకోవడం అనేది ఎవరి జీవితంలో అయినా చాలా కష్టతరమైనా క్షణాలే అని చెప్పవచ్చు.

కానీ ఏఆర్ రెహమాన్ ఇంత సడెన్ గా ఇలాంటి నిర్ణయం తీసుసుకుంటారని ఎవరూ ఊహించలేరు. కానీ విడాకులు తీసుకోవడం వెనకున్న అసలు కారణం ఏంటనే వెతికే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే ఏఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసే మోహిన డే కూడా తన భర్త సాక్సోఫోన్ వాద్యకారుడు మార్క్ హార్ట్ సచ్ తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడం ఇప్పుడు మరింత ఆసక్తి కలిగిస్తోన్న అంశం.

అయితే ఏఆర్ రెహమాన్ విడాకులు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన అసిస్టెంట్ వాద్యకారిణి మోహిని డే కూడా తన భర్తకు డివోర్స్ ప్రకటించడం సంచలనంగా మారింది. అసలు మోహిని డే ఎవరు అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాల ట్రెండింగ్ అవుతోంది.


మోహిని డే ఎవరు?

కోల్ కతాకు చెందిన 28ఏళ్ల మోహిని డే ఒక వాద్యకారిణి. అలాగే ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఫ్యాషన్ డిజైనర్, వ్యాపారవేత్త కూడా. ఈ మోహిని డే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సాంగ్స్ కు బాస్ వాద్యకారిణి. వీరిద్దరూ కూడా తమ డివోర్స్ పోస్టులో తమ ప్రైవసీని గౌరవించండి.. మ్యూచువల్ గా నిర్ణయం తీసుకునే డివోర్స్ తీసుకుంటున్నాం అంటూ పోస్టుల్లో రాసుకురావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.


వీరిద్దరి పోస్టుల మధ్య గంటల వ్యవధి ఉండటం చూస్తుంటే..ముందుగా అనుకుని తమ భాగస్వాముల నుంచి విడాకులు తీసుకున్నారా...లేదా ఇద్దరి మధ్య ఏదైనా ఎఫైర్ ఉందా అనే చర్చ కూడా నడుస్తోంది. నెటిజన్స్ అయితే 57ఏళ్ల రెహమాన్ 28ఏళ్ల మోహిని ఎలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఏఆర్ రెహమాన్ అభిమానులు ఎటూ అర్థం కాక..ఏదీ తేల్చుకోలేక పోతున్నారు. మరీ వారిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటనేది త్వరలోనే ఓ క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.


కాగా ఏఆర్ రెహమాన్, సైరా బాను విడిపోయేందుకు కారణాలను అడ్వకేట్ వందనా షా ఇలా చెబుతూ భావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగానే వారిద్దరూ విడిపోయారు. దంపతుల మధ్య సంబంధాల సమస్యలు ఈ నిర్ణయానికి దారితీశాయి. ఇరువురి మధ్య గాడమైన ప్రేమ ఉన్నప్పటికీ ఈ జంట తమ మధ్య వచ్చే విభేదాలు, పోరాటాల విషయంలో పరిష్కరించుకోలేకపోయారు. అవి వారి మధ్య పూడ్చలేని అంతరాన్ని ఏర్పరుచాయి. శ్రీమతి సైరా బాధ, వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తమ గోప్యతను గౌరవాన్ని ప్రజలు కాపాడాలని వారిద్దరూ కోరారని న్యాయవాది తెలిపారు. 

Tags:    

Similar News