Rashmika Mandanna: వైరల్‌ అవుతోన్న రష్మిక ఫస్ట్‌ ఆడిషన్‌ వీడియో.. 19 ఏళ్ల వయసులో ఎంత క్యూట్‌గా ఉందో చూశారా

Rashmika mandanna first audition video:రష్మిక మందన్న ఈ పేరును ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పుష్ప2 చిత్రంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ను సంపాదించుకుందీ బ్యూటీ.

Update: 2024-10-09 16:00 GMT

Rashmika Mandanna

Rashmika mandanna first audition video: రష్మిక మందన్న.. ఈ పేరును ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పుష్ప2 చిత్రంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ను సంపాదించుకుందీ బ్యూటీ. అత్యంత తక్కువ సమయంలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. తన క్యూట్‌ నటన, అందంతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది.

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది. అనంతరం అనతి కాలంలోనే స్టార్‌ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. గీత గోవిందం మూవీతో స్టార్‌ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. దీంతో ఈ బ్యూటీకి బాలీవుడ్‌లోనూ ఆఫర్లు క్యూ కట్టాయి. అక్కడ కూడా మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

ఇక సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌ ఉంటూ ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటుంది బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక ఫస్ట్‌ ఆడిషన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రష్మిక కెరీర్‌లో తొలిసారి పాల్గొన్న ఆడిషన్‌లో కన్నడ భాషలో మాట్లాడింది. ఆ సమయంలో ఆమె వయసు 19 ఏళ్లు. ప్రస్తుతం చలాకీగా మాట్లాడుతూ డైలాగ్‌లు చెబుతున్న ఈ బ్యూటీ.. ఫస్ట్‌ ఆడిషన్‌ సమయంలో మాత్రం ఇబ్బందిపడింది. తన పేరు రష్మిక అని, వయస్సు 19 సంవత్సరాలు, ఎత్తు 5.5. నేను రెండవ సంవత్సరం B.A. చదువుతున్నా' అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తాను ఆడిషన్‌కి రావడం ఇదే తొలిసారి చెప్పుకొచ్చిన రష్మిక తొలుత ఇంగ్లీష్‌లో మాట్లాడింది. అయితే కన్నడ టీమ్‌ సభ్యులు కన్నడలో మాట్లాడమని కోరారు. అయితే ఆ తర్వాత రష్మిక తమిళ్‌లో మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. వావ్‌ రష్మిక ఎంత క్యూట్‌గా ఉందో అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.


Tags:    

Similar News