కరోనా లాంటి విపత్కరమైన సమయంలో చాలా మంది ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.. అందులో భాగంగా టాలీవుడ్ విలన్ సోనూసూద్ లాక్ డౌన్ వలన ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చి సహాయం అందించారు. ప్రజారవాణా లేకా కాలినడకన తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా వలస కూలీలను చూసి చలించిపోయి వారికి బస్సు సౌకర్యాలు కలిపించి వారిని వారి గ్రామాలకు పంపించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సోనూ వలస కార్మికుల కోసం మూడు ప్రత్యేక రైళ్లను బుక్ చేశారు. కుటుంబపోషణ కోసం బిహార్, యూపీ నుంచి వచ్చి ముంబయిలో ఉంటున్న వలస కార్మికులను తమ ఇళ్లకు చేర్చేందుకు ఈ రైళ్లను ఏర్పాటు చేయనున్నారు.
తాజాగా సోనూసూద్ మాట్లాడుతూ..మొదటిసారి బస్సులను ఏర్పాటు చేసి కొంతమంది కూలీలను ముంబై నుంచి కర్ణాటకకు పంపించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయని అన్నారు సోనూసూద్. గ్యాప్ లేకుండా కాల్స్ వస్తుండటంతో కొన్నిసార్లు కొందరు చేసిన కాల్స్, మెస్సేజ్‌లను మిస్సయ్యానన్నారు. అందుకోసమే ఇటీవల ఓ టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. బస్సుల్లో వలస కార్మికులను పంపించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావటం కొంత ఆలస్యం అవుతున్నదని అందుకే మూడు రైళ్లను బుక్ చేసినట్లుగా తెలిపారు. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో నాకు సాయం చేస్తున్న సినీ పరిశ్రమ, ఇతర రంగాల్లోని స్నేహితులకు ధన్యవాదాలు అని సోనూ తెలిపారు.