నేను పెళ్లికి రెడీ అంటున్న హీరో తరుణ్?
Tarun Marriage : టాలీవుడ్ లో మొన్నవరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరోలు అంతా మెల్లిమెల్లిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే
Tarun Marriage : టాలీవుడ్ లో మొన్నవరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరోలు అంతా మెల్లిమెల్లిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే రానా, నిఖిల్, నితిన్ వంటి యంగ్ హీరోలు ఓ ఇంటివాళ్ళు అయ్యారు.. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో తన బ్యాచులర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. ఆ హీరో హీరో ఎవరో కాదు.. తరుణ్.. అవును త్వరలో తరుణ్ ఓ ఇంటివాడు కాబోతున్నట్టుగా టాలీవుడ్ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.
తరుణ్ 37 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇంకా బ్యాచిలర్ గానే ఉంటున్నాడు. ప్రస్తుతం సినిమాలు చేయకున్న బిజినెస్ పనులతో బిజీగా ఉండడం వలన పెళ్లి చేసుకోవడం కుదర్లేదు అంటూ చెప్పుకొచ్చాడు తరుణ్. అటు మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక తరుణ్ సినీ కెరీర్ విషయానికి వచ్చేసరికి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా ఎదిగాడు...నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, శశిరేఖా పరిణయం మొదలగు సినిమాల్లో నటించాడు.
కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో హిట్లు కొట్టి లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.. ఆ తర్వాత వరుస ప్లాపులు రావడంతో హీరోగా కనుమరుగు అయ్యాడు. ప్రస్తుతం సినిమాలు లేకున్నప్పటికీ అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు. ఇక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రేక్షకులను అలరించేందుకు తరుణ్ సిద్దం అవుతున్నాడని తెలుస్తోంది.