దైవత్వమే సినిమాల సక్సెస్ ఫార్ములా.. ఒకే కామన్ పాయింట్ తో హిట్ కొట్టిన మూడు చిత్రాలు

Movie News: సినిమాల సక్సెస్ ట్రెండ్ ఒక్కొసారి ఒక్కోలా ఉంటుంది.‌ ఆ ఫార్ములాను ఫాలో అయి, హిట్ కొట్టడమే మేకర్స్ ముందున్న ఆప్షన్.

Update: 2022-08-21 08:30 GMT

దైవత్వమే సినిమాల సక్సెస్ ఫార్ములా.. ఒకే కామన్ పాయింట్ తో హిట్ కొట్టిన మూడు చిత్రాలు

Movie News: సినిమాల సక్సెస్ ట్రెండ్ ఒక్కొసారి ఒక్కోలా ఉంటుంది.‌ ఆ ఫార్ములాను ఫాలో అయి, హిట్ కొట్టడమే మేకర్స్ ముందున్న ఆప్షన్. ఈమధ్య కాలంలో దైవత్వాన్ని ఆసారాగా చేసుకున్న సినిమాలకు ప్రేక్షకాదరణ బాగా దక్కుతున్న నేపథ్యంలో, ఇప్పుడిదే హిట్ ఫార్ములాగా కనబడుతొంది.

శివతత్వంతో గతేడాది బాలకృష్ణ చేసిన అఖండ, విష్ణు తత్వంతో ఈమధ్యే వచ్చిన కార్తికేయ 2 అద్భుత విజయాలను అందుకున్నాయి. అటు నార్త్‌లోనూ కార్తీకేయ 2 కు మంచి రెస్పాన్స్ దక్కించుకోవడానికి కారణం శ్రీకృష్ణుడి తత్వాన్ని బలంగా చూపించి భగవద్గీతలోని ఆయన సారాన్ని ఫాంటసీ డ్రామాకి జోడించిన వైనం. ఇది ఉత్తరాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే కృష్ణుడుని పూజించే, ఇష్టపడే నార్త్ ఆడియన్స్‌కి ఇలా బిగ్ స్క్రీన్ మీద గ్రాఫిక్స్ సహాయంతో క్వాలీటీ కంటెంట్‌ని ప్రెజెంట్ చేయటంతో సినిమాను ఓన్ చేసుకున్నారు. త్రిపుల్ ఆర్ చిత్రంలో సైతం క్లైమాక్స్‌లో రామ్ చరణ్‌ను, రాముడి గెటప్‌లో చూసి ఆడియన్స్ స్టన్ అయ్యారు. ఇలా మన సినిమాలు నార్త్ లోనూ వర్కౌట్ అవ్వడానికి దైవత్వమే ప్రధానకారణమయింది. అంతకు ముందు అఘోరాగా బాలకృష్ణ చెప్పిన శివతత్వాన్ని సబ్ టైటిల్స్‌తోనే చూసిన నార్త్ ఆడియన్స్, ఓటీటీలో అఖండకు అధ్బుతమైన ఆదరణను కట్టబెట్టారు.

తాజాగా మూడు సినిమాల విజయాలను గమనిస్తే దైవత్వమే నేటి సినిమాల సక్సెస్ ఫార్ములాల్లో ఒకటిగా మారిందని అర్దమవుతొంది. అందుకే రాబోయే రోజుల్లో రచయితలు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకునెందుకు సిద్దమయ్యారు. ఇదే కాన్సెప్ట్‌తో రాబోతున్న బ్రహ్మాస్త్రా సినిమా విజయంపై కూడా సదరు చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. అయితే దాన్ని ఎంత కన్విన్సింగ్‌గా తీశారన్నదే చూడాలి. ఇక అయోధ్య ఆలయ నిర్మాణం పూర్తయ్యేనాటికి ప్రభాస్ ఆది పురుష్ కూడా థియేటర్స్ లోకి రానుంది. సరికొత్తగా సెట్ అయిన ఈ సక్సెస్ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడం కోసం దర్శకనిర్మాతలు తమవంతు ప్లానింగ్‌లు, ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News