Rang De: చివరి 40 నిమిషాలు చాలా ఎమోషనల్: వెంకీ అట్లూరి
Rang De: నితిన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రంగ్ దే' మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
Rang De: నితిన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రంగ్ దే' మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా, వెంకి అట్లూరి దర్శకత్వం వహించారు. కథ కూడా ఆయనదే. విడుదల సందర్బంగా వెంకీ మీడియాతో ముచ్చటించారు.
ఆయన మాట్లాడుతూ, "తొలి ప్రేమ" "మిస్టర్ మజ్ను" తరువాత నేను ఓ అందమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాను. దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు అర్జున్, అను పాత్రలు నా ఆలోచనలను తాకాయి. ఈ సినిమాలో రోమాన్స్ తోపాటు భావోద్వేగాలపై కూడా ఎక్కువగా ఫోకస్ చేశాము.
'రంగ్ దే' సినిమా ఇంద్ర ధనస్సులోని అన్ని రంగుల వలె భిన్నమైన అనుభూతితో పాటు భావోద్వేగాలను పంచుతుంది. ఈ సినిమాలో కామెడీ, ఎమోషనల్ డోస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. చివరి నలభై నిమిషాల పాటు ప్రేక్షకులకు ఉద్వేగభరితంగా సాగుతూ.. మంచి అనుభూతిని అందిస్తుంది.
'రంగ్ దే' కోసం నితిన్ మొదటి ఎంపిక కాదని వెల్లడించాడు వెంకీ. స్క్రిప్ట్ రాసిన తరువాత, నా మనస్సులో ఇద్దరు హీరోలు ఉన్నారని చెప్పారు. "ఈ సినిమా నిర్మాత నాగ వంశీ నితిన్ పేరును సూచించారు. నితిన్ నా స్క్రిప్ట్ ను అంగీకరిస్తారా అనే సందేహం నాకు ఉంది, కానీ ఒకే సిట్టింగ్ లో నితిన్ ఓకే చెప్పాడ" ని ఆయన తెలిపారు. నితిన్, కీర్తి సురేష్ ఇద్దరూ 'రంగ్ దే' స్క్రిప్ట్ పై ఎక్కువ నమ్మకం ఉంచారు. దీంతో నాకు కొంచెం ప్రయోగం చేసేందుకు అవకాశం దొరికిందని అన్నారు. ట్రైలర్ విడుదల తరువాత, భారీగా సానుకూల స్పందన వచ్చింది. ప్రేక్షకులు మా 'రంగ్ దే' ని తప్పక ఆదరిస్తారని మాకు నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.