తమన్ మరియు దేవిశ్రీ కి ఇండస్ట్రీలో రోజులు చెల్లాయా?
తమన్ మరియు దేవిశ్రీ కి ఇండస్ట్రీలో రోజులు చెల్లాయా?
Thaman and Devi Sri Prasad: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ సంగీత దర్శకులలో ముందుగా ఉండే రెండు పేర్లు దేవిశ్రీప్రసాద్ మరియు తమన్. 2000 నుంచి 2018 వరకు దేవిశ్రీప్రసాద్ సింగిల్ హ్యాండెడ్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలారని చెప్పుకోవచ్చు. ఆర్య, రంగస్థలం, సింగం వంటి ఎన్నో సినిమాలకి అదిరిపోయే మ్యూజిక్ అందించారు దేవిశ్రీ. ఆ తరువాత వరుస చార్ట్ బస్టర్లతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయారు.
అల వైకుంఠపురంలో, రేసుగుర్రం దూకుడు సినిమాలతో తమకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు తమన్. తమ ఖాతాల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ కొంతకాలంగా వీరిద్దరి పాటలలో సంగీతంలో ఆ స్పార్క్ మాత్రం కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి మొదటి పాట గురించి అప్డేట్ విడుదలైంది కానీ ప్రేక్షకులు మాత్రం ఆ పాట పై అంతగా ఆసక్తి చూపించడం లేదు.
మరోవైపు ఈ మధ్యనే విడుదలైన టీజర్ లో కూడా నేపథ్య సంగీతం యావరేజ్ గా ఉంది. రంగా రంగా వైభవంగా, మరియు రౌడీ బాయ్స్ వంటి సినిమాలకి సంగీతాన్ని అందించిన దేవిశ్రీప్రసాద్ కూడా మంచి విజయాన్ని సాధించలేకపోయారు. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ చేతుల్లో "పుష్ప: ది రూల్", మరియు తమన్ చేతుల్లో మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా మాత్రమే పెద్ద సినిమాలు. ఈ సినిమాలైనా వీరికి మంచి హిట్ ఇస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.