Pushpa 2: పుష్ప2పై టీడీపీ ఎంపీ సంచలన ట్వీట్.. వెంటనే డిలీట్, అసలేమైంది..?
Pushpa 2: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప2 విడుదల గురించే చర్చ నడుస్తోంది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ మూవీపై ఆకాశన్నంటే అంచనాలు ఉన్నాయి.
Pushpa 2: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప2 విడుదల గురించే చర్చ నడుస్తోంది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ మూవీపై ఆకాశన్నంటే అంచనాలు ఉన్నాయి. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా మొదలు సోషల్ మీడియా వరకు మొత్తం పుష్ప2 గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి సంచల ట్వీట్ చేశారు. అయితే కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ కాస్త నెట్టింట వైరల్ అవ్వడం మొదలైంది.
గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ బైరెడ్డి శబరి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ విషయమై ఆమె ట్వీట్ చేస్తూ.. 'అల్లు అర్జున్ గారు మీరు నంద్యాలలో చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ మా జనాలు ఇంకా మర్చిపోలేదు. నంద్యాలలో మీరు ఎలా అయితే ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించారో అలాగే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. నంద్యాల వెళ్లాలనే మీ సెంటిమెంట్ మాకు బాగా వర్కవుట్ అయ్యింది. కాబట్టి మీ సెంటిమెంట్ ఇప్పుడు మాకు సెంటిమెంట్‌గా మారింది' అంటూ రాసుకొచ్చింది. అలాగే పుష్ప2 భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.
అయితే ఈ ట్వీట్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఎడిట్ చేసిన శబరి.. ఆ తర్వాత కాసేపటికే ట్వీట్‌ను డిలీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ కాస్త వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే పుష్ప2 టికెట్ల ధర పెంపునకు సంబంధించి ఇప్పటికే తెలంగాణలో అనుమతులు లభించగా, ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది. సుకుమార్ దర్వకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కిన పుష్ప2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో జరుపుతోంది.