Simbaa: మొక్కలు నాటితే ఉచితంగా సినిమా టికెట్స్.. మూవీ యూనిట్ బంపరాఫర్..!
Simbaa: మానవాళి జీవితం సక్రమంగా ఉండాలంటే ప్రకృతి సహకరించాలి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Simbaa: మానవాళి జీవితం సక్రమంగా ఉండాలంటే ప్రకృతి సహకరించాలి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకృతి బాగుండాలంటే కచ్చితంగా చెట్లు నాటాలి. అయితే ప్రస్తుతం చెట్ల నరికివే యథేశ్చగా సాగుతోంది. ఓవైపు మొక్కలు నాటాలని ఉద్యమాలు జరుగుతున్నాయి, మరోవైపు పారిశ్రామికరణ పేరుతో చెట్లను నరికివేస్తున్నారు.
ప్రకృతి రక్షించుకోవాలని, ప్రకృతి ప్రాధాన్యతను వివరిస్తూ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా ఇలాంటి కథంతోనే మరో సినిమా వస్తోంది. సింబా ది ఫారెస్ట్ మెన్ పేరుతో కొత్త సినిమా రాబోతోంది. సంపద్ నద్ది వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మురళీ మనోహర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనసూయ, జగపతి బాబు, కస్తూరీ, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు సంపత్ నంది కథను అందించడం విశేషం.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నటుడు శ్రీనాథ్ సినీ లవర్స్‌కి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. మొక్కలు నాటి తనకు మెసెజ్ చేస్తే టికెట్లు ఫ్రీగా పంపిస్తానని ఆఫర్ ఇచ్చారు.
దీంతో సంతోష్ కుమార్ సైతం ముందుకు వచ్చారు. శ్రీనాథ్ మాత్రమే కాదు.. తాను కూడా టికెట్లు ఇస్తానని, ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటండని కోరాడు. ఇలా ప్రకృతి పరిపరక్షణ కోసం తమదైన శైలిలో ముందడుగు వేసింది చిత్ర యూనిట్. ఇక దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ.. ఈ సినిమా సాకారం కావడానికి సహకారం అందించిన వారిని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన ఫ్యామిలీ గురించి చెబుతూ స్టేజ్ మీద కంటతడి పెట్టేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. మురళీ మనోహర్ లండన్ ఫిల్మ్ స్కూల్‌లో సినిమా కోర్సులు నేర్చుకున్నాడు. లండన్‌లోనే రెండు ఇండీ సినిమాల కోసం అక్కడి ప్రొడక్షన్ కంపెనీల్లో పని చేశాడు. తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. అనంతరం దర్శకుడు సంపత్ నంది వద్ద.. ఏమైంది ఈ వేళ, రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నందా చిత్రాలకు పని చేశాడు. గాలి పటం చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా, పేపర్ బాయ్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ పని చేశాడు. ఇప్పుడు సింబాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరి తొలి సినిమాతో మురళీ మనోహర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.