Sushmita Sen: లలిత్ మోదీ కంటే ముందు 10 మందితో సుస్మితా సేన్ సహజీవనం.. వారెవరంటే!
Sushmita Sen: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఐపీఎల్ సృష్టికర్త లలిత్‌మోడీ ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో, సోషల్ మీడియాలోనూ హాట్‌టాపిక్‌గా మారింది.
Sushmita Sen: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఐపీఎల్ సృష్టికర్త లలిత్‌మోడీ ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో, సోషల్ మీడియాలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. తాము డేటింగ్‌లో ఉన్నామని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు లలిత్ మోడీ ట్విట్టర్‌లో ప్రకటించారు. దీంతో అందరి దృష్టి ఆ ఇద్దరిపై పడింది. లలిత్ మోడీ విదేశాలకు ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? సుస్మితా సేన్ ఎఫైర్లు ఎన్నున్నాయి? లలిత్ మోడీతో పెళ్లెప్పుడు? వంటి ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. లలిత్ మోడీ కంటే ఇప్పుడు సుస్మిత అఫైర్లను చూసి అందరూ అవాక్కవుతున్నారు. సుస్మిత సినిమాల కంటే అఫైర్లతోనే నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
క్రికెట్ అభిమానులకు అందరికీ తెలిసిన పేరు లలిత్ మోడీ ఐపీఎల్ సృష్టికర్తగా 2008 నుంచి 2010 వరకు మొదటి చైర్మన్‌గా అందరికీ సుపరిచితమే. ఐపీఎల్‌లో అవినీతి, మనీలాండరింగ్ వివాదాలతో 2010లోనే దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నాడు. లలిత్ మోడీని ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 2013లోనే నిషేధం అయితే మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను లలిత్ మోడీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. సుస్మితా సేన్ ఎప్పటి నుంచో తెలిసినా కొత్తగా డేటింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో లలిత్ మోడీ, సుస్మితా సేన్ వ్యవహారం ఇప్పుడు అటు బాలీవుడ్‌లోనూ సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. లలిత్ మోడీ కంటే మాజీ విశ్వ సుందరి సుస్మిత సేన్ విషయమే హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు.
సుస్మితా సేన్ ఎవరెవరితో ప్రేమలో పడిందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. తాజాగా లలిత్ మోడీతో సుస్మితా సహజీవనం చేస్తోంది. పెళ్లి, ఎంగేజ్‌మెంట్ చేసుకోలేదని ప్రేమలో ఉన్నట్టు సుస్మిత కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. లలిత్ మోడీ కంటే ముందు తన కన్న 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మాన్ షాల్‌తో సహజీవనం చేసింది. దాదాపు మూడేళ్లు కలిసి ఉన్న ఈ జంట 2021లో విడిపోయింది. రోహ్మాన్‌కు ముందు దస్తక్ సినిమా నిర్మిస్తున్న సమయంలో విక్రమ్ భట్‌తో సుస్మితకు సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్తా డేటింగ్‌వరకు వెళ్లి ఇద్దరూ కొంతకాలం కలిసి గడిపారు. దర్శకుడు విక్రమ్ భట్‌కు అంతకుముందే పెళ్లయింది. తన వివాహ బంధంలో ఇబ్బదులు తలెత్తడంతో మాజీ విశ్వసుందరితో ఉన్న బంధానికి విక్రమ్ ముగింపు పలికాడు. 2006లో దర్శకుడు మానవ్ మీనన్‌తోనూ సుస్మిత ప్రేమ వేరే లెవల్‌లో ఉండేది అప్పట్లో వారి రిలేషన్‌షిప్‌పై బాలీవుడ్‌లో కథలు కథలుగా చెప్పుకున్నారు. మానవ్, సుస్మిత చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఎక్కడికి వెల్లినా కలిసే వెళ్లేవారు. అయితే ఏమయిందో ఏమో కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు.
కర్మ, హోలీ సినిమాల్లో హీరో రణదీప్ హుడాతో కలిసి సుస్మిత నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి ప్రేమ చిగురించింది. ప్రేమలో పడిన కొంతకాలానికే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బంధం కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రితిక్ భాసిన్‌తోనూ సుస్మిత కొన్నాళ్లు ప్రేమయాణం సాగించింది. ఈ ఇద్దరూ కలిసి క్రికెటర్ జహీర్‌ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక పెళ్లికి కూడా హాజరయ్యారు. ఆ తరువాత ఎందుకనో ఇద్దరూ విడిపోయారు. హాట్ మెయిల్ సృష్టికర్త సభీర్ భాటియాతోనూ కొన్నాళ్లు సాన్నిహిత్యంగా మెలిగింది సుస్మిత. అయితే ఇది కూడా ప్రేమ దశలోనే ఆగిపోయింది. పెళ్లి దిశగా పయనించలేదు. ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కార్నర్ స్టోన్ ఫౌండర్ బంటి సచ్‌దేవ్‌తో కొన్నాళ్లు ప్రేమలో మునిగి తేలిని సుస్మిత ఆ తరువాత కేవలం ఫ్రెండ్స్ అంటూ రిలేషన్‌కు బ్రేకప్ చెప్పుకున్నారు.
2010లో దుల్హా మిల్ గయా సినిమా చేస్తున్న సమయంలో దర్శకుడు ముద్దాసిర్ అజీజ్‌కు సుస్మిత దగ్గరైంది. ఆ తరువాత ఇద్దరూ డేటింగ్‌కూడా చేసినట్టు ప్రచారమైంది. కుటుంబ కారణాలతోనే ఇద్దరూ విడిపోయినట్టు తెలుస్తోంది. 2013లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్‌తో సుస్మిత సహజీవనంలో ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే వీరిద్దరరూ ఎప్పుడూ తమ బంధాన్ని మాత్రం ధ్రువీకరించలేదు. ఇక 36 ఏళ్ల వయస్సుల్లో 22 ఏళ్ల ఇంతియాజ్‌తోనూ ప్రేమలో పడినట్టు అప్పట్లో బాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. వీరి ప్రేమకు సాక్ష్యంగా గోవాలో ర్యాంప్ వాక్ కూడా చేశారు. కొన్నాళ్లకే తమ మధ్య ఏమీ లేదంటూ తేల్చి చెప్పారు.
ఇప్పటివరకు పెళ్లి పీటలు ఎక్కని సుస్మిత ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఇప్పుడు ఆమె లలిత్ మోడీతో డేటింగ్‌లో ఉంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. అయితే ఈ బంధమైనా పెళ్లితో మరింత బలంగా మారాలని పలువురు కోరుతున్నారు.