Sushant Rajput Case: సుశాంత్‌ మృతి కేసు.. రియా విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ

Update: 2020-08-07 05:38 GMT

Sushant Rajput Case: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణకై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రంగంలోకి దిగడం పట్ల రియా చక్రవర్తి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసులో తాను దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో తీర్పు రాకముందే సీబీఐ విచారణ ప్రారంభించడం చట్ట విరుద్ధమంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తిగా చట్టవిరుద్ధం. న్యాయ సూత్రాలకు అతీతం. దేశ సమాఖ్య స్పూర్తిపై ప్రభావం చూపుతుంది అని పేర్కొన్నారు.

సుశాంత్‌ సొంత రాష్ట్రమైన బిహార్‌( ప్రభుత్వం) ఈ కేసులో సీబీఐ విచారణ కోరడంతో కేంద్రం ఇందుకు అంగీక‌రించింది. ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపిన సీబీఐ సుశాంత్‌ కేసులో రియాతో పాటు మరో ఐదుగురి(ఇంద్రజిత్‌ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, షోయిక్‌ చక్రవర్తి, శామ్యూల్‌ మిరంద, శ్రుతి మోదీ) పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. బిహార్‌ పోలీసుల నుంచి ఈ కేసును ముంబై పోలీసులకు అప్పగించాలని తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడక ముందే సీబీఐ విచారణ మొదలుపెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఇదే కేసులో నేడు ఈడి విచారణకు హాజరు కావాల్సిందిగా రియా చక్రవర్తికి ఆదేశాలు జారీ చేసింది. విచారణ వాయిదా వేయాల్సిందిగా రియా విజ్ఞప్తిని తిరస్కరించింది ఈడీ.

Tags:    

Similar News