Sushant Rajput Case: సుశాంత్‌ మృతి కేసు.. సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌

Update: 2020-08-05 10:05 GMT

Sushant Rajput Case: బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్ ప్రభుత్వం కోరిన విధంగా ఈ కేసును సీబీఐకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసుపై సీబీఐ విచారణకు సిఫారసు చేయాలని బిహార్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు.

మ‌రోవైపు సుప్రీంకోర్టుని ఈ కేసుని పాట్నా నుండి ముంబైకి మార్చాలంటూ సుశాంత్ కేసులో అనుమానిత‌రాలైన ఆయ‌న ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి వేసిన పిటిష‌న్‌ను కూడా ప‌రిశీలించింది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఈ కేసులో ఇరు వర్గాలు మూడు రోజుల్లోగా తమ సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి దర్యాప్తును వారం పాటు వాయిదా వేసింది. అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన కేసులో నిజానిజాలు బయటికి రావాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు బీహార్ పోలీసు అధికారిని క్వారంటైన్ చేయడం మంచి సంకేతం కాదని పేర్కొంది. దీనిపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ మూడు రోజుల్లో సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించింది.

Tags:    

Similar News