Super Machi Movie: ఓటిటిలో చిరంజీవి అల్లుడి సినిమా..?
Super Machi Movie: ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్ ఫాం వేదికగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Super Machi: మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు రూపొందించిన తాజా చిత్రం 'సూపర్ మచ్చి'. ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్ ఫాం వేదికగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్న వేళ కొన్ని సినిమాలను నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంటున్నారు నిర్మాతలు. థియేటర్స్‌లో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రం సూపర్ మచ్చి కూడా డిజిటల్ వేదికగా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీటై చాలా రోజులు అయిపోయింది. అయితే కరోనా కారణంగానే సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు. యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ నటించిన 'థ్యాంక్ యూ బ్రదర్' మే 7న ఆహాలో నేరుగా విడుదల కానుంది.
రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, రియా చక్రవర్తి, రచితా రామ్, పోసాని కృష్ణ మురళి, నరేష్, భద్రం, ప్రగతి, అజయ్, 'జబర్దస్త్' మహేష్, పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. విజేత సినిమాతో ఇండస్ట్రీకీ పరిచయమైన కళ్యాణ్ దేవ్ కు ఆ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వలేదు. ఆ సినిమాలో కళ్యాణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'సూపర్ మచ్చి' తో ఎలాగైనా హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.
'సూపర్ మచ్చి' చిత్రాన్ని తెలుగు ఓటీటీ ఆహాలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు డిజిటల్ రైట్స్ కూడా భారీగా అమ్ముడుపోయాయని ప్రచారం జరుగతుంది. క్రాక్, నాంది, గాలి సంపత్, జాంబీరెడ్డి, తెల్లవారితే గురువారం వంటి సూపర్ హిట్ చిత్రాలు ఆహాలో స్ట్రీమవుతున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఆహాలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.