ఢీ షో గురించి క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుదీర్...

Sudigali Sudheer: టీవీ ప్రేక్షకులలో సుడిగాలి సుదీర్ తెలియనివారు ఉండరు...

Update: 2022-05-10 15:30 GMT
Sudigali Sudheer Gave Clarity on Dhee Dance Show | Live News Today

ఢీ షో గురించి క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుదీర్...

  • whatsapp icon

Sudigali Sudheer: టీవీ ప్రేక్షకులలో సుడిగాలి సుదీర్ తెలియనివారు ఉండరు. ఏ హిట్ షో చూసినా సరే అందులో సుధీర్ తప్పకుండా కనిపిస్తాడు. తన స్కిట్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సుడిగాలి సుదీర్ తాజాగా ఇప్పుడు హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో సుధీర్ హీరోగా నటించారు. అయితే గత కొంతకాలంగా సుధీర్ ఢీ షో లో కనిపించడం లేదు.

ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఢీ షో లో నుండి సుధీర్ ని కావాలనే కొందరు తప్పించారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సుధీర్ కావాలని ఢీ నుంచి తప్పుకున్నాడని మరికొందరు చెబుతున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కనిపిస్తున్న సుధీర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. "సుధీర్ అన్న నీ షో వీకెండ్ వస్తే మేము బాగా ఎంజాయ్ చేస్తాము. కానీ నువ్వు ఢీ షో లో ఎందుకు కనిపించడం లేదు" అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి సుధీర్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

"ఢీ షోను నేనెప్పుడు ఆపాను? కొంచెం పాజ్ ఇచ్చాను అంతే. ఐ విల్ బీ బ్యాక్ వెరీ సూన్" అంటూ సుధీర్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకవైపు టీవీ షోలు మరోవైపు సినిమాలతో సుధీర్ కెరియర్ బిజీగా ఉంది. తాజాగా సుధీర్ హీరోగా "కాలింగ్ సహస్ర" అనే ఒక సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా మాత్రమే కాక "గాలోడు" అనే ఒక సినిమాలో కూడా సుధీర్ హీరోగా నటిస్తున్నారు.

Tags:    

Similar News