బాలకృష్ణ తనయుడితో సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్

బాలకృష్ణ తనయుడితో సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్

Update: 2022-09-07 14:00 GMT

బాలకృష్ణ తనయుడితో సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్

Mokshagna Teja: నందమూరి అభిమానులు అందరూ నందమూరి బాలకృష్ణ తనయుడు అయిన నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరో గా మారతాడు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మోక్షజ్ఞ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వినిపించగా, "ఆదిత్య 369" సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని మరి కొందరు చెప్పుకొచ్చారు. తేజ డైరెక్షన్లో కూడా మోక్షజ్ఞ తన మొదటి సినిమా చేస్తున్నాడు అని కొన్ని పుకార్లు బయటకి వచ్చాయి.

ఇక తాజాగా ఈ జాబితాలో కొత్తగా చేరిన పేరు రాహుల్ సాంకృత్యాన్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "టాక్సీ డ్రైవర్" సినిమాతో రాహుల్ మంచి హిట్ అందుకున్నారు.ఈ మధ్యనే నాని హీరోగా నటించిన "శ్యామ్ సింగరాయి" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాహుల్ తదుపరి సినిమా ఎవరితో అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సందర్భంలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తో సినిమా చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ టర్కీ లో జరుగుతూ ఉండగా మోక్షజ్ఞ కూడా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి టర్కీ వెళ్ళాడు.

రాహుల్ సంకృత్యాన్ కూడా టర్కీలో మోక్షజ్ఞను కలిసి ఒక ప్రేమ కథను నేరెట్ చేశారట. మోక్షజ్ఞ కి కూడా కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణకి ఎలాగో మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి మోక్షజ్ఞ కి మొదటి సినిమాతో డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేస్తే బాగుంటుందని రాహుల్ సంకృత్యాన్ మోక్షజ్ఞ కోసం మంచి పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News