Rhea Chakroborty Bail : రియా బెయిల్ ని తిరస్కరించిన ముంబై స్పెషల్ కోర్టు!
Rhea Chakroborty Bail : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మెదటి నుంచి A1 నిందితురాలుగా ఉన్న రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో
Rhea Chakroborty Bail : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మెదటి నుంచి A1 నిందితురాలుగా ఉన్న రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో భాగంగా నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో (NCB) మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీనితో బెయిల్ కోసం రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో సహా మరో ఐదుగురు బెయిల్ పిటిషన్ల కోసం ముంబై స్పెషల్ కోర్టును ఆశ్రయించారు.. అయితే ఈ బెయిల్ లను ముంబై కోర్టు తిరస్కరించింది.. బెయిల్ మంజూరు చేస్తే విచారణకు అడ్డంకులు ఏర్పడుతాయని నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు వాటి ఫిటీషన్లను కొట్టివేసింది... దీనితో రియా సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీల్ ఉండనుంది..
ఇక అంతకుముందు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) డ్రగ్స్ కేసులో భాగంగా ఆమెను వరుసగా నాలుగు రోజులు విచారణ చేసింది.. అనంతరం ఆమెను అరెస్ట్ చేసింది.. ఎన్‌డీపీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసింది.. అయితే ఆమె తమ్ముడు షోవిక్ ఇచ్చిన వివరాలు ఈ కేసులో కీలకంగా మారాయని చెప్పాలి.. రియా సూచనల మేరకే సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని విచారణలో షోవిక్ చెప్పడంతో ఆ కోణంలో ఎన్ సీబీ విచారణ చెప్పట్టి వివరాలను రాబట్టింది.. ఆమె నుంచి ల్యాప్ టాప్, మొబైల్ లను స్వాధీనం చేసుకొని ఆధారాలను సేకరించింది. అటు విచారణలో రియా 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు చెప్పినట్టు సమాచారం..
ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న ముంబై లోని తన నివాసంలో చనిపోయాడు.. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదని హత్య అని పలువురు కామెంట్స్ చేయడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరియు సంబంధిత మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) పరిశీలిస్తోంది.
Bail pleas of Showik Chakraborty, Rhea Chakraborty, Abdul Basit, Zaid Vilatra, Dipesh Sawant & Samuel Miranda have been rejected by a special court in Mumbai.
— ANI (@ANI) September 11, 2020
They're arrested by NCB in connection with drugs case related to #SushantSinghRajput case. pic.twitter.com/pFO8bqYIxi