SP Sailaja On SPB Health : కోలుకుంటున్న ఎస్పీ బాలు...

SP Sailaja On SPB Health : ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Update: 2020-08-18 08:04 GMT
sp balu and shailja (File Photo)

SP Sailaja On SPB Health : ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి గత గురువారం విషమించడంతో ఆయనకు వెంటిలేటర్‌ సాయంతో చికిత్సను అందించారు వైద్యులు... ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడుని ప్రార్దిస్తున్నట్టుగా సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.. అయితే అయన తాజా ఆరోగ్య పరిస్థితి పైన యన సోదరి ఎస్పీ శైలజ స్పందించారు.

ప్రస్తుతం ఎస్పీబీ కాస్త కోలుకున్నారని, వెంటిలేటర్ సాయం లేకుండా ఆయన శ్వాస తీసుకుంటున్నారని ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఆడియో సందేశాన్ని పంపించారు. అన్నయ్య ఆరోగ్యం మెరుగవుతుంది. అయన వైద్యానికి స్పందిస్తున్నారు. ఇది సంతోషించాల్సిన విషయం... ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రార్ధిస్తున్నారు. అందరికి ధన్యవాదాలు..అన్నయ్య కోలుకుని మళ్ళీ మన ముందుకు వచ్చేస్తారు అని ఎస్పీ శైలజ వెల్లడించారు.

ఇక ఎస్పీ బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అయన మాట్లాడుతూ... ఎస్పీబీ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కలిసి ఒకేసారి ప్రార్థిస్తే, అది మరింత శక్తిమంతంగా ఉంటుంది. అందుకే ఈ రోజు(18వ తేదీ)సాయంత్రం 6గంటలకు యూనివర్సల్‌ మాస్‌ ప్రేయర్‌ చేద్దామని అనుకుంటున్నాం" అని అన్నారు.  



Tags:    

Similar News