Sonu Sood help to telugu students: తెలుగు విద్యార్థుల‌ను ఆదుకున్న‌ సోనూ సూద్‌

Sonu Sood help to telugu students: క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యం నుండి వ‌ల‌స కూలీలు, కార్మికుల‌ను స్వ‌స్థలాలకు చేరుస్తూ వారి పాలిట బాలీవుడ్ న‌టుడు సోను సూద్‌ దేవుడుగా నిలిచాడు.

Update: 2020-07-25 08:41 GMT
Sonu Sood help to telugu students

Sonu Sood help to telugu students: క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యం నుండి వ‌ల‌స కూలీలు, కార్మికుల‌ను స్వ‌స్థలాలకు చేరుస్తూ వారి పాలిట బాలీవుడ్ న‌టుడు సోను సూద్‌ దేవుడుగా నిలిచాడు. అంద‌రి దృష్టిలో రియల్ హీరోగా మారాడు. కార్మికులు కాలి న‌డ‌క‌న వెళ్ల‌కుండా వారికి భోజ‌నం ఏర్పాటు చేసి, ప్ర‌త్యేకంగా బ‌స్సులు ఇచ్చి మ‌రీ ఇంటికి చేర్చాడు. అలాగే కేర‌ళ‌లో చిక్కుక‌పోయిన ఒడిశా కూలీల‌ను త‌న స్వంత డ‌బ్బుల‌తో ప్ర‌త్యేక విమానాన్ని ఏర్పాటు చేసి పంపించి తన ఉదార‌త చాటుకున్నారు. తాజాగా మ‌రో సారి సోనూ సూద్ త‌న సేవ‌భావాన్ని చూపించాడు. లాక్‌డౌన్‌తో కిర్గిస్తాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులకు స్వదేశానికి తీసుకొచ్చి మరోసారి రియల్ హీరోగా మారారు. కిర్గిస్తాన్‌లో చిక్కుకుపోయిన 1500మంది తెలుగు విద్యార్థులను విశాఖకు చేరుకున్నారు. అంద‌రి మాన్న‌న‌లు పొందారు.

వివ‌రాల్లోకెళ్తే.. కిర్గిస్తాన్‌ రాజధాని బిష్‌కేక్‌లోని మెడికల్‌ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల విద్యార్థులు క‌రోనా ఎఫెక్ట్‌తో అక్క‌డే చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ప్రత్యేక విమానాల ద్వారా వందల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. కానీ కొన్ని కారణాలతో మరికొంత మంది తెలుగు విద్యార్థులు అక్కడే చిక్కుకున్నారు. ఈ విష‌యాన్ని సోషల్ మీడియా ద్వారా సోను సూద్‌కు చెప్పుకున్నారు. దీంతో సోనూ సూద్ అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా వారికి విమాన టికెట్ ధరను కూడా తగ్గించి మొత్తం 176 మంది విద్యార్థులను విశాఖకు తీసుకొచ్చారు. విశాఖకు చేరుకున్న విద్యార్థులు సోను సూద్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. దీంతో సోనూ సూద్ చేస్తున్న స‌హ‌యానికి అన్ని వ‌ర్గాల నుండి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News