ప్రముఖ సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా వ్యాపారవేత్త రామ్‌ను జనవరి9న పెళ్లి చేసుకుంది. రామ్ వీరపనేనిని సునీత పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇంట్లో జరిగిన వేడుకను షూట్ చేసింది సునీత. నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు అంతా ఈ వీడియోలో ఉంది. తాజాగా ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ టీజర్ విడుదలైంది. సునీత తన అఫీషియల్ యూ ట్యూబ్ ఛానెల్లోనే ఈ వీడియోను విడుదల చేసింది.