Singer Sid Sriram: సిద్‌ శ్రీరామ్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Singer Sid Sriram: కొన్ని కొన్ని సార్లు పాట చాలా బాగుంటే సింగర్ కి పేరోస్తుంది.

Update: 2022-01-24 15:31 GMT

Singer Sid Sriram: సిద్‌ శ్రీరామ్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Singer Sid Sriram: కొన్ని కొన్ని సార్లు పాట చాలా బాగుంటే సింగర్ కి పేరోస్తుంది. కానీ కొన్ని సార్లు పాట పాడిన సింగర్ వల్ల ఆ పాటకే అందమొస్తుంది. అలాంటి కొద్ది మంది సింగర్ లలో సిద్‌ శ్రీరామ్‌ కూడా ఒకరు. తన గొంతు వినకుండా కుర్రకారు కి రోజు గడవదు. తను పాట పాడితే అది హిట్ అవ్వక మానదు. తన గొంతు లోనే మ్యాజిక్ ఉంది అంటారు అభిమానులు. "మాటే వినదుగా" పాట నుండి మొన్న వచ్చిన "శ్రీ వల్లీ" పాట దాకా సిద్‌ శ్రీరామ్‌ పాడిన చాలా పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఒకే ఒక్క పాట తో చిన్న సినిమాపై కూడా భారీగా అంచనాలు పెంచగలిగే సత్తా సిద్‌ గొంతుకు ఉంది.

'టాక్సీవాలా'లో 'మాటే వినదుగా..', 'అల వైకుంఠపురములో' చిత్రంలో 'సామజవరగమన..', '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'లో 'నీలి నీలి ఆకాశం..', 'వకీల్‌ సాబ్‌'లో మగువా మగువా..', 'రంగ్‌ దే'లో 'నా కనులు ఎపుడు..', 'పుష్ప'లో పాడిన 'శ్రీవల్లి'.. ఇలా చెప్పుకుంటూ పోతే సిద్‌ ఖాతాలో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయ్. అయితే శ్రీరామ్‌ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? అక్షరాలా రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకు సిద్‌ రెమ్యూనరేషన్ ఉంటుందట. నిజానికి సింగర్స్‌కు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ ఉండదు కానీ సిద్‌ శ్రీరామ్‌ మాత్రం సింగర్స్ లో ఒక సెన్సేషన్‌. అందుకే నిర్మాతలు కూడా ఎంత డబ్బు ఇచ్చైనా సరే సిద్‌ శ్రీరామ్‌తోనే పాడించడానికి ముందుకు వస్తున్నారు.

Tags:    

Similar News