పురుషాధిక్యతపై షాకింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్
Shruti Haasan: ఇండస్ట్రీ ని నిందించడంలో అర్థం లేదు అంటున్న శృతిహాసన్
Shruti Haasan: సినిమా ఇండస్ట్రీలో పురుషాధిక్యత పై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యూనరేషన్ అంతగా ఇవ్వరని, స్త్రీ పురుషులను సమానంగా చూడరని ఎంతో మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా ఇప్పుడు స్టార్ బ్యూటీ శృతిహాసన్ కూడా ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. సమాజం మొత్తం పురుషాధిక్యత ఉందని కేవలం ఇండస్ట్రీని మాత్రమే ఈ విషయంలో వేలెత్తి చూపించడం సరికాదని, సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దానికి ప్రతిబింబం మాత్రమేనని చెప్పుకొచ్చింది శృతిహాసన్.
ఈ విషయంలో కేవలం సినీ ఇండస్ట్రీని మాత్రమే నిందించడం లో అర్థం లేదు అని అన్నారు శృతిహాసన్. ఇక నెపోటిజం గురించి మాట్లాడుతూ సాధారణంగా స్టార్ కిడ్స్ కు చాలా అవకాశాలు వస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారని, కానీ వారి తల్లిదండ్రులు కేవలం ఇండస్ట్రీలోకి ఎంట్రీ కోసం మాత్రమే ఉపయోగపడతారని, ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సొంత టాలెంట్ ఉండాల్సిందేనని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు శృతిహాసన్. అయితే తాను ఇండస్ట్రీలోకి వచ్చే సమయంలో తన తల్లిదండ్రులు ఎవరికీ ఫోన్ చేసి రికమెండ్ చేయలేదని ఇప్పటికీ కూడా తన కష్టంతోనే తాను ఇండస్ట్రీలో ఉన్నానని తెలిపింది ఈ భామ. ప్రస్తుతం శృతిహాసన్ సలార్, #ఎన్.బి.కె107, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలలో నటిస్తోంది.