Sharwanand: పీక్ టైంలో రిస్క్ తీసుకున్న శర్వానంద్
Sharwanand: "ఒకే ఒక జీవితం" సినిమాతో పెద్ద రిస్కే తీసుకున్న శర్వానంద్
Sharwanand: గత కొద్ది కాలంగా హీరో శర్వానంద్ కరియర్ లో ఒక్క మంచి హిట్టు కూడా లేదని చెప్పుకోవాలి. "మహానుభావుడు" సినిమా తర్వాత శర్వానంద్ నటించిన "పడి పడి లేచే మనసు", "రణరంగం", "జాను", "శ్రీకారం", "మహాసముద్రం", "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయాయి. ఇలా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న శర్వానంద్ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో "ఒకే ఒక జీవితం" అనే సినిమాలో నటించారు.
నిజానికి అభిమానులు శర్వానంద్ ని "రన్ రాజా రన్", "ఎక్స్ప్రెస్ రాజా" వంటి ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలలో చూడాలని అనుకుంటున్నారు.కానీ "ఒకే ఒక జీవితం" ఒక సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ డ్రామా. శ్రీ కార్తిక్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి అమల అక్కినేని ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో కనిపించారు.
టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో నడిచే ఈ కథ తల్లి కొడుకుల సెంటిమెంట్ తో సాగుతుంది. నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శర్వానంద్ ఇలాంటి సినిమా చేయటం పెద్ద రిస్క్ అని చెప్పుకోవాలి. ఏదేమైనా ఈ సినిమా ప్రస్తుతానికి మంచి టాక్ తో మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మరి "సీతారామం", "కార్తికేయ 2" అంత పెద్ద హిట్ అవుతుందో లేదో చూడాలి.