Sreekaaram: శర్వానంద్ 'శ్రీకారం' మూవీ రివ్యూ
Sreekaram: శర్వానంద్ 'శ్రీకారం'సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Sreekaram: 'వచ్చానంటివో, పోతానంటివో.. వగలు పలుకుతావే' అనే సాంగ్ గత ఏడాది రిలీజై ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ పాట యుత్ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. 'శ్రీకారం' చిత్రం నుంచి విడుదలైన ఈ పాటకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ పాట విడుదల తర్వాత శర్వానంద్ 'శ్రీకారం'సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'మహానుభావుడు', 'శతమానం భవతి', 'జాను' వంటి కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రాలు చేస్తూ..ఫ్యామిలీ ఆడియెన్స్ తోపాటు, యుత్ ఆడియెన్స్‌లో మంచి ఇమేజ్ సంపాదించాడు శర్వానంద్.
శర్వానంద్ హీరోగా కిషోర్ బి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిన చిత్రం మహాశివరాత్రి కానుకగా గురువారం(మార్చి11)న ప్రేక్షకుల ముందకు వచ్చింది. బాక్సాఫీసు వద్ద విడుదలైన ఈ చిత్రం శర్వా ఖతాలో మరో విజయం చేకూర్చిందా? లేక నిరాశపరిచిందా అనే విషయం ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
ఆధునిక వ్యవసాయం, యువత వ్యవసాయంలోకి రావటం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఓ యువకుడు రైతుగా మారి వ్యవసాయం చేయాలనుకుంటాడు. వ్యవసాయం చేస్తే నష్టాలు కాదు.. లాభం వచ్చేలా ఆధునిక వ్యవసాయం చేసి చూపిస్తాడు. అయితే ఆ గ్రామంలో విలన్ రైతులకు అధిక వడ్డీకి డబ్బులు ఇస్తాడు. రైతుల వద్ద నుంచి అతి తక్కువ ధర కి వారి భూములను కొనుక్కుంటాడు. ఊరిలో శర్వానంద్ రావు రమేష్ కొడుకు గా కనిపిస్తాడు. బాగా చదువుకున్న శర్వానంద్ అతని తండ్రి.. సాయి కుమార్ కి ఉన్న అప్పు గురించి తెలుసుకుంటాడు. లగ్జరీ లైఫ్ వదలి గ్రామానికి వస్తాడు. ఆ తర్వాత హీరో, విలన్ కు ఎలా బుద్ధి చెబుతాడు. గ్రామస్తుల మనసుని ఎలా గెలుచుకుంటాడు. ఆ యువకుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎదురైన పరిస్థితులేంటి..?అన్నదే కథ
ఎవరేలా చేశారంటే..
శర్వానంద్ తో పాటు హీరోయిన్ ప్రియాంక కూడా అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ కనబరిచింది. సాఫ్టవేర్ నుంచి రైతుగా మారిన పాత్రలో శర్వానంద్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు బి కిశోర్‌కు ఇది తొలి చిత్రమే అయినప్పటికీ అనుభవం ఉన్న దర్శకుడిగా చిత్రాన్ని తీశాడు. రైతు సమస్యలను తెరపై చూపించడానికి బి కిశోర్ తీవ్రంగా కసరత్తు చేశాడనే చెప్పాలి. ఈ సినిమాతో విమర్శకుల నోళ్లు మూయించేలా తీశాడు కిశోర్.
ఇక సినిమా ఫస్ట్ ఆఫ్ శర్వా, ప్రియాంకల మధ్య లవ్ సీన్న్ సాగుతుంది. నిత్యం తన పనితో బిజీగా ఉండే అబ్బాయిని ఎలా పడేయ్యాలి అనే కాన్సెప్టులో ప్రియాంక నటన ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో అసలు కథ స్టార్డ్ అవుతోంది సాఫ్ట్ వేర్ ఉద్యోగి..రైతుగా మారి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కోణంలో చూపించాడు. అయితే గతంలో మహేశ్ మహర్షి సినిమా వచ్చినప్పటికీ కొత్తకోణంలో శ్రీకారం చూపించాడు దర్శకుడు.
ఈ చిత్రం ద్వారా హీరో శర్వానంద వ్యవసాయం గురించి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారని చెప్పొచ్చు. చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రంలోని కథతో కనెక్ట్ అవ్వడం విశేషం. ఈ చిత్రం వ్యవసాయ ఆధారిత తెలుగు ప్రేక్షకులకు గట్టిగా తగులుతుంది. ఎమోషన్స్ అందరినీ కదిలిస్తాయి. ఈ వారంలో తప్పనిసరిగా చూసే చిత్రంగా 'శ్రీకారం' నిలుస్తుందనే చెప్పాలి. కథ కూడా గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు.
సాకేతికంగా..
ఎడిటింగ్, స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే మంచి అవుట్ పుట్ వచ్చేది.. సినిమా నరేషన్ నేను కూడా చాలా స్లోగా ఉంటుంది. స్క్రీన్ ప్లే మరి ఇంత ఫాస్ట్ గా పెట్టి ఉంటే ఇంకా ఎక్కువ ఫీల్ వచ్చేది. ఈ సినిమా ఎడిటింగ్ మరింత పనితనం కనబర్చవచ్చు. చాలా అనవసరమైన సన్నివేశాలు ఉండగా పెద్దగా కథ ఉపయోగం లేని చిన్న చిన్న సన్నివేశాలు మధ్యమధ్యలో వస్తూ ఉంటాయి. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ సినిమాకి మేజర్ అట్రాక్షన్. కథలో కొత్త అంశాలు ఉన్నప్పటికీ తర్వాత జరగబోయే సీన్లను ప్రేక్షకులు ముందుగానే ఊహిస్తారు. రావురమేష్, ఆమని, నరేష్, సాయికుమార్, మురళి శర్మ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిక్కీ జె మేయర్ సంగీతం ఆకట్టుకుంది. మొత్తానికి శ్రీకారం ఓ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం అనే చెప్పాలి.