Jawan First Day Collection: బాక్సాఫీస్ వద్ద బంఫర్ హిట్.. తొలిరోజు వసూళ్లతో రికార్డులు బ్రేక్ చేసిన షారూఖ్ 'జవాన్'

Jawan First Day Collection: షారుఖ్ ఖాన్ సినిమా 'జవాన్' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమా తొలిరోజు బంపర్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.70-80 కోట్ల వరకు వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

Update: 2023-09-08 04:54 GMT

Jawan First Day Collection: బాక్సాఫీస్ వద్ద బంఫర్ హిట్.. తొలిరోజు వసూళ్లతో రికార్డులు బ్రేక్ చేసిన షారూఖ్ 'జవాన్'

Shah Rukh Khan Jawan First Day Collection: షారుఖ్ ఖాన్ సినిమా 'జవాన్' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమా తొలిరోజు బంపర్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.70-80 కోట్ల వరకు వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. సినీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపిన వివరాల ప్రకారం, జవాన్ మొదటి రోజునే నేషనల్ చైన్‌లో దాదాపు రూ.30 కోట్లు రాబట్టింది. ఈ సినిమా పీవీఆర్ ఐనాక్స్‌లో రూ.23.40 కోట్లు, సినీపోలీస్‌లో రూ.5.90 కోట్లు రాబట్టినట్లు ఆయన తెలిపారు. ఈ గణాంకాలు రాత్రి 10.45 గంటల వరకు ఉన్నాయి. రాత్రి 8.30 గంటల వరకు మూవీ మ్యాక్స్‌లో రూ.90 లక్షలు రాబట్టింది. ఈ కోణంలో నేషనల్ చైన్ లో తొలిరోజు రూ.27.02 కోట్ల బిజినెస్ చేసిన పఠాన్ సినిమా రికార్డును జవాన్ బ్రేక్ చేసింది. కేజీఎఫ్ (హిందీ) రూ. 22.15 కోట్లు రాబట్టి రెండో స్థానంలో ఉంది. కాగా, వార్ రూ. 19.67 కోట్లు రాబట్టింది.

75 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది

sacnilk వెబ్‌సైట్ ప్రకారం ఈ సినిమా మొదటి రోజు రూ.75 కోట్లు వసూలు చేసింది. హిందీలో రూ.65 కోట్ల బిజినెస్ చేసింది. అదే సమయంలో తమిళం, తెలుగు భాషల్లో 5 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. ఈ విధంగా తొలిరోజు రూ.59 కోట్లు రాబట్టి రికార్డులు సృష్టించిన పఠాన్ సినిమా మరో రికార్డును జవాన్ బ్రేక్ చేసింది.

అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన షారుక్..

జవాన్ సినిమాకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో, షారుఖ్ ఖాన్ అభిమానులు పటాకులు పేల్చి సంబరాలు చేసుకోవడం, కొన్నిసార్లు ఈ సినిమా పోస్టర్లను పాలాభిషేకాలు చేయడం కనిపిస్తుంది. షారుఖ్‌తో పాటు నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే, సంజయ్ దత్, ప్రియమణి, సన్యా మల్హోత్రా వంటి తారలు ఈ సినిమాలో నటించారు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో షారుక్ చాలా హ్యాపీగా ఉన్నాడు.

Tags:    

Similar News