Actor Raavi Kondala Rao Passed Away: ప్ర‌ముఖ నటుడు రావి కొండలరావు క‌న్నుమూత‌

Actor Raavi Kondala Rao Passed Away: ప్రముఖ తెలుగు సినీ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత రావి కొండలరావు కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Update: 2020-07-28 12:45 GMT
Ravi Kondala Rao

Actor Raavi Kondala Rao Passed Away:  ప్రముఖ తెలుగు సినీ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత రావి కొండలరావు కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ రావి కొండలరావు మరణం సినీ, నాటక రంగాలకు తీరని లోటుగా పేర్కొన్నారు. తమ నివాళులర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 1932లో జన్మించిన రావి కొండలరావు సుకుమార్ అనే కలం పేరుతో వివిధ పత్రికల్లో ఎన్నో కథలు రాశారు. అనంత‌రం ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600లకు పైగా సినిమాలలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు... రావి కొండల రావు చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ రచనలు చేసేవారు. 1965లో చదువు పూర్తి చేసి.. ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్‌గా శ్రీశ్రీ, ఆరుద్రలతో కలిసి పనిచేశారు. అనంతరం పనిచేస్తున్న కొడవటిగంటి కుటుంబరావు, నండూరి రామమోహనరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి మొదలైనవారితో పరిచయాలు ఏర్పరచుకున్నారు.

ద‌ర్శకుడు కమలాకర కామేశ్వరరావు సిఫారసుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు. ఆ తర్వాత తేనె మనసులు, దసరా బుల్లోడు, రంగూన్‌రౌడి, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, రాధాగోపాలం, కింగ్‌, ఓయ్‌, వరుడు తదితర చిత్రాల్లో రావి కొండలరావు నటించారు. ఆయన భార్య రాధా కుమారి కూడా నటి. ఈమె 2012లో మరణించారు. ఇద్దరూ భార్యా భర్తలుగా దాదాపు 150 సినిమాల్లో నటించారు.         

Tags:    

Similar News