Leader Movie Sequel: రానా సినిమాకి సీక్వెల్ ప్రకటించిన శేఖర్ కమ్ముల

* ప్రియా ఆనంద్ మరియు రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది

Update: 2021-09-21 09:00 GMT

రానా - శేఖర్ కమ్ముల(ఫైల్ ఫోటో)

Leader Movie Sequel: 2010లో విడుదలైన పొలిటికల్ డ్రామా "లీడర్" సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి అరంగేట్రం చేసింది ఈ సినిమాతోనే. శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మొదటి సినిమా అయినప్పటికీ ఒక ముఖ్యమంత్రి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు రానా. ఆసక్తికరమైన రియాలిటీకి దగ్గరగా ఉండే కథతో ప్రేక్షకులు మెప్పించారు శేఖర్ కమ్ముల. ప్రియా ఆనంద్ మరియు రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారట.

సీక్వెల్ లో కూడా రానానే హీరోగా కనిపించబోతున్నారు. రానా మరొకసారి రాజకీయ నాయకుడి పాత్రలో చూడటానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శేఖర్ కమ్ముల స్వయంగా ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతోందని ప్రకటించారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన "లవ్ స్టొరీ" సినిమా ఈనెల 24న థియేటర్లలో విడుదల కాబోతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News