Samantha: ఆ దర్శకులతో పనిచేయడం కష్టం.. బాగా ఏడ్చేశా: సమంత
Samantha: బాలీవుడ్ దర్శకులు రాజ్ అండ్ డీకేను ఉద్దేశించి హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samantha: బాలీవుడ్ దర్శకులు రాజ్ అండ్ డీకేను ఉద్దేశించి హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారితో కలిసి పని చేయడం చాలా కష్టంగా ఉందంటున్నారు. తమ కాంబోలో వచ్చిన తొలి ప్రాజెక్ట్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ షూట్ రోజులను గుర్తు చేసుకున్న సమంత.. షూట్లో తాను బాగా ఏడ్చేశానని చెప్పారు. రాజ్ అండ్ డీకేతో కలిసి పనిచేయడంతో పోలిస్తే తెలుగు, తమిళం చిత్రాల్లో పని చేయడం ప్రశాంతంగా ఉంటుందన్నారు. సాధారణంగా తన సినిమాల్లో రోజుకు రెండు లేదా మూడు సీన్స్ చేసేవారని.. కానీ ఇక్కడ ఓ గంటలోనే ఆ సీన్స్ చిత్రీకరిస్తారని చెప్పారు.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో రాజీ పాత్ర సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్స్‌ను మొదటి షెడ్యూల్లోనే పూర్తి చేశారని చెప్పారు. రెండు రోజుల తర్వాత తన మేనేజర్‌కు ఏడ్చుకుంటూ ఫోన్ చేశానని.. తన వల్ల కావడంలేదని చెప్పానన్నారు. కానీ రానురాను వారి వర్కింగ్ స్టైల్‌కు అలవాటు పడ్డానన్నారు. సిటడెల్ హనీబన్నీ కోసం మరోసారి ఈ టీమ్‌తో కలిసి పనిచేయడం తనకు నచ్చిందన్నారు సమంత.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం రాజ్ అండ్ డీకేతో తొలిసారి సమంత వర్క్ చేశారు. ఆ సిరీస్‌లో సమంత పాత్రకు విశేష ఆదరణ లభించింది. వీరి కాంబినేషన్లో వచ్చిన రీసెంట్ సిటడెల్ హనీ బన్నీలో వరుణ్ ధావన్ కీలక పాత్ర పోషించారు. ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. హనీగా సమంత నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.