Salman Khan: ప్రమాదకరమైన వ్యాధి.. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ కి పెట్టింది పేరు.
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ కి పెట్టింది పేరు. కండల వీరుడి గా పిలవబడే సల్మాన్ ఖాన్ కు తన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పటికప్పుడు వర్కౌట్లు చేస్తూ మంచి ఫిజిక్ మెయింటైన్ చేయటం సల్మాన్ ఖాన్ కి బాగా అలవాటు. కానీ తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఒక వింత వ్యాధితో బాధ పడుతున్నారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే 2017 లో వచ్చిన ట్యూబ్ లైట్ సినిమా సమయంలో సల్మాన్ ఖాన్ కి ఒక వింత వ్యాధి ఉంది అనే విషయాన్ని బయట పెట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో ఇది కూడా ఒకటి.
అదే ట్రిజేమినల్ న్యూరల్జియా. ఈ వ్యాధి ఉన్న వారిలో ఉండే ప్రధాన లక్షణం మూతి వంకర్లు పోవడం. నరాల సమస్య వల్ల ఈ వ్యాధి ఉన్నవారు ఎవరైనా ఎక్కువ సేపు మాట్లాడితే వారి మూతి వంకర్లు పోతుందని ముఖ భాగం భరించలేనంత నొప్పిగా ఉంటుందని చెప్పారు సల్మాన్ ఖాన్. అయినా కూడా సల్మాన్ ఖాన్ తన నొప్పిని ఎప్పుడు బయట పెట్టకపోవడం గమనార్హం. చాలాసార్లు తనకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని సల్మాన్ ఖాన్ అనడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ ఈ వ్యాధి నుంచి కొంత వరకు కోలుకున్నారట. ఈ వ్యాధికి అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాను అని సల్మాన్ ఖాన్ తెలిపారు.