Salman Khan: కోవిడ్ ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్ కోసం సల్మాన్ ఖాన్ సాయం

Salman Khan: కోవిడ్ వారియర్స్‌ కోసం ప్రత్యేకంగా వంట చేయించి సల్మాన్ ఖాన్ వారికి అందజేస్తున్నారు

Update: 2021-05-01 01:52 GMT

Salman khan;(File Image)

Salman Khan: దేశంలో కరోనా మహమ్మారి దడపుట్టిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్లి థియేటర్స్ లో సినిమా చూసేంత సినిమా లేదు. దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌మ సినిమాలు పూర్తిగా వాయిదా వేసుకోవ‌డం త‌ప్ప మ‌రేం చేయ‌లేక‌పోతున్నారు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో స్టార్స్ అంతా ఇంటికే పరిమితమయ్యారు. చాలా మంది కరోనా విషయంలో అవేర్‌నెస్ కలిగించటంతో పాటు కోవిడ్ అప్‌డేట్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ కండల వీరుడు మాత్రం ఫీల్డ్ లో దిగి మరి సాయం చేస్తున్నారు.

లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలోనూ తన వంతు సాయంగా భారీ విరాళం ప్రకటించిన సల్మాన్‌ ఖాన్‌… ఈ సారి స్వయంగా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. కోవిడ్ వారియర్స్‌ కోసం ప్రత్యేకంగా వంట చేయించి వారికి అందజేస్తున్నారు. ఏదో మనుషులను పెట్టి పని చేయించటం కాదు.. తానే స్వయంగా కిచెన్‌లో ఉండి ఆ పనిని పర్యవేక్షిస్తున్నారు సల్మాన్‌ భాయ్‌.

తన సొంత రెస్టారెంట్ చైన్‌ `భాయ్‌జాన్‌ కిచెన్‌` ద్వారా ఈ సర్వీస్‌ చేస్తున్నారు సల్మాన్‌. రోజు ముంబైలోని 5000 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు భాయ్‌జాన్‌ కిచెన్‌ నుంచి ఫుడ్ అందేలా ఏర్పాట్లు చేశారు. ఇక సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన రాధే మూవీ మే 13న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలోని సీటీమార్ సాంగ్ ను రీమిక్స్ చేసారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. కోవిడ్‌ సిచ్యుయేషన్‌లో ఈ సినిమాను థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

సినిమాను మే 13న థియేటర్‌తో పాటు జీ ప్లెక్స్ లో కూడా విడుదల చేస్తున్నారు. అయితే రాధే సినిమా చూడాలంటే అక్షరాలా 249 రూపాయలు చెల్లించాలి. కానీ పే పర్ వ్యూ పద్దతిలో మరీ అంత పెడితే చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి సినిమా చూడాలంటే ప్రతీ వినియోగదారుడు ₹249 చెల్లించాలి. ఆహా, హాట్ స్టార్ అయితే ఏడాది సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. మరోవైపు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటివి కూడా ఆర్నెళ్లు చూడొచ్చు. 250 రూపాయలకు ఇప్పుడు అంత వ్యాల్యూ ఉంది. అలాంటిది ఒక్క సినిమా కోసం అంత పెడతారా.. పెట్టి చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News