సింగర్ సునీత రెండో పెళ్లిపై మళ్లీ రూమర్లు
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే సింగర్ సునిత రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
అతి తక్కువ సమయంలో సింగర్ గా చాలా పెద్ద పేరు సంపాదించుకున్నారు సునీత. ఆ తర్వాత టెలివిజన్ యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా సత్తా చాటారు. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులను ఎదురుకున్నారు. అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు సునీత. అయితే భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే సింగర్ సునిత రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మ్యాన్ ని సునీత వివాహం చేసుకోనుందని, ఆ వ్యక్తికి కూడా ఇది రెండో వివాహమేనని ఆ వార్తల సారాంశం. గతంలో కూడా సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
వాటిని సునీత కుడా చాలా సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ ఈ వార్తలకి బ్రేక్ పడడం లేదు. తాజాగా మళ్ళీ సునీత పెళ్లి వార్తలు రావడంతో చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి మరి! అటు సునీతకి ఇద్దరు పిల్లలున్నారు.