RRR Movie: రేపు ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్
RRR Movie: *ప్రపంచ వ్యాప్తంగా 11,000కు పైగా థియేటర్స్‌లో రిలీజ్ *అమెరికాలో దాదాపు 2,500 స్క్రీన్స్‌లో సినిమా
RRR Movie: రేపు ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ కాబోతోంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి, రామారావు, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ట్రిపుల్ ఆర్ రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా 11,000కు పైగా థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా రికార్డులకెక్కింది. ఒక్క అమెరికాలోనే 1,150 పైగా లోకేషన్స్‌లో దాదాపు 2,500 స్క్రీన్స్‌లో తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అమెరికాలో ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ ఇప్పటికే రెండు మిలియన్స్ క్రాస్ చేసి మూడు మిలియన్ డాలర్స్ దిశగా దూసుకెళ్తోంది. రిలీజ్ సమయానికి మూడు మిలియన్ మార్క్ దాటేస్తోందని అంచనా వేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే ప్రీమియర్ షోలకే 20కోట్లు వసూళ్లు చేస్తుందని భావిస్తున్నారు.
యునైటెడ్ కింగ్‌డమ్ లో 1100 పైగా స్క్రీన్స్‌లో , ఆస్ట్రేలియా, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, థాయిలాండ్, జపాన్ కలుపుకుని 2000 స్క్రీన్లలో ట్రిపుల్ ఆర్ విడుదలవుతోంది. ఇటు నార్త్‌లో 3000 పైగా థియేటర్స్, తమిళనాడులో 400 ప్లస్ థియేటర్స్, కేరళలో 250 థియేటర్స్, కర్ణాటకలో 350 ప్లస్ థియేటర్స్ , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1500లకు పైగా థియేటర్స్ పైగా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు పాన్ ఇండియా మూవీగా రికార్డులకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరోజే 75వేల నుంచి 80 వేల షోలతో ట్రిపుల్ ఆర్ విశ్వరూపం చూపనుంది.
తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. పెరిగిన టికెట్ రేట్లతో ఒక్కరోజులోనే 40కోట్ల వరకు అదనంగా కలెక్షన్స్ రానున్నాయి. మొదటి రోజే 150 కోట్ల నుంచి 170 కోట్ల రూపాయల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ఇండియా ఫస్ట్ టైమ్ డాల్బీ విజన్‌లో చూడవచ్చు. అలాగే త్రీడి వెర్షన్ కూడా ఆడియన్స్ కు అందుబాటులోకి తీసుకువచ్చారు. ట్రిపుల్ ఆర్ సినిమా హిందీలో కూడా భారీ లెవల్‌లో రిలీజ్‌ను సొంతం చేసుకోబోతోంది.