Japan: ముత్తు రికార్డు బద్దలు కొట్టిన ఆర్ ఆర్ ఆర్
* "ఆర్ ఆర్ ఆర్" మొదటి స్థానాన్ని ఆక్రమించగా "ముత్తు" రెండవ స్థానంలో సెటిల్ అయ్యింది.
Breaking Records: జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమా "ఆర్ ఆర్ ఆర్". కేవలం భారత దేశంలో మాత్రమే కాక ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంది. నాన్ బాహుబలి రికార్డులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఈ మధ్యనే జపాన్ లో కూడా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.
ఇక ఈ సినిమా జపాన్ లో కూడా విడుదల కాబోతోంది అనే వార్త బయటకి వచ్చినప్పటి నుండి ఈ సినిమా రజినీకాంత్ "ముత్తు" కలెక్షన్లు చేరుతుందో లేదో అని ఆసక్తి సర్వత్రా ఆసక్తి నెలకొంది. "ముత్తు" సినిమా జపాన్ లో 400 మిలియన్ జాపనీస్ యెన్ (22+ కోట్లు) వసూళ్లు నమోదు చేసుకుంది.జపాన్ లో అత్యధిక కలెక్షన్లను రాబట్టి న ఇండియన్ సినిమా ఇప్పటిదాకా "ముత్తు" నే. కానీ ఇప్పుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ "ఆర్ ఆర్ ఆర్" ఈ రికార్డును బద్దలు కొట్టింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు"ముత్తు" కలెక్షన్ల రికార్డు పదిలంగా ఉంది.
తాజాగా "ఆర్ ఆర్ ఆర్" సినిమా ఈ రికార్డును బద్దలు కొట్టేసింది. "ఆర్ ఆర్ ఆర్" ఇప్పుడు జపాన్ లో 400 మిలియన్ జాపనీస్ యెన్ కలెక్షన్లు నమోదు చేసుకొని కొత్త రికార్డు ని సృష్టించింది. ఇప్పుడు "ఆర్ ఆర్ ఆర్" మొదటి స్థానాన్ని ఆక్రమించగా "ముత్తు" రెండవ స్థానంలో సెటిల్ అయ్యింది. జపాన్ లోని 44 నగరాల్లో 200 కి పైగా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.