రవితేజ 'క్రాక్' మూవీ టాకీ పార్ట్ పూర్తి
మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు క్రాక్ గా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అయిపోయారు. గోపీచంద్ మలినేని ఈ క్రాక్ ను తీర్చి దిద్దుతున్నారు.
మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు క్రాక్ గా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అయిపోయారు. గోపీచంద్ మలినేని ఈ క్రాక్ ను తీర్చి దిద్దుతున్నారు. ఈ సినిమా ఇప్పుడు టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్' షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. త్వరలో హీరో హీరోయిన్లు రవితేజ, శ్రుతి హాసన్‌పై ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఆ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లే.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న 'క్రాక్'లో హీరోయిన్గా శ్రుతి హాసన్ కథకు కీలకమైన ఓ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వర్గాల వారినీ ఆకట్టుకొనే అంశాలు ఉన్నాయి. పేరుపొందిన తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు.
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ క్రాక్ సినిమాకి ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 'మెర్సాల్', 'బిగిల్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
రవితేజకు జతగా శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా వరలక్ష్మీ శరత్‌కుమార్, దేవీ ప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి తదితరులు నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై రూపొందుతున్న క్రాక్ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం గోపీచంద్ మలినేని వహిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.