రవితేజ మూవీ ఆ దర్శకుడితో.. 16 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో సినిమా!
Raviteja: భద్ర సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమైన బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది
Raviteja: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంచనాలు లేకుండా విడుదల అయిన క్రాక్ సూపర్ హిట్ సాధించడంతో రవితేజ మళ్లీ పూర్వ ఫామ్ అందుకున్నాడు. దీంతో రవితేజతో్ సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో మాస్ డైరెక్టర్ రవితేజతో కలిసి సినిమా తీయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వీరిద్దరు కలిసి 16 ఏళ్ల తర్వాత సినిమా చేయడం పెద్ద విశేషమే. ఇంతకి ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా?. ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
రవితేజ సినిమా 2005లో వచ్చిన భద్ర సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమైన బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇన్నేళ్లలో ఈ కాంబినేషన్లో ఇప్పటివరకు మరో సినిమా రాలేదు. కాగా ఈ కాంబినేషన్లో 16 సంవత్సరాల తర్వాత మరో సినిమా వస్తున్నట్లు వినికిడి. బోయపాటి ఇప్పటికే రవితేజ కోసం ఓ ఫుల్ యాక్షన్ స్క్రిప్టును రెడి చేసినట్లు తెలుస్తోంది. రవితేజకి సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశారట.
ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో 'అఖండ' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను రవితేజతో ఓ సినిమాను ప్లాన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదలకావల్సి ఉంది.
కాగా..క్రాక్ తర్వాత రవితేజ తాజా చిత్రం ఖిలాడి. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఓటీటీ లో రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే సినిమా థియేటర్లో విడుదల చేస్తామని నిర్మాత తేల్చిచెప్పాడు. థియేటర్లు మళ్లీ తెరచుకుంటే ముందుకొచ్చే సినిమాల్లో ఖిలాడి ముందు వరుసలో ఉండనుంది. . ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకుడు. రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇదే కాంబినేషన్'లో రవితేజ హీరోగా 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే.