Covid Effect: 'ఖిలాడి' వాయిదా.. విడుదల ఎప్పుడంటే..

Covid Effect: రవితేజ ఈ ఏడాది 'క్రాక్' సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు.

Update: 2021-05-03 16:05 GMT

ఖిలాడీ సినిమాలో రవితేజ (ట్విట్టర్)

Covid Effect: రవితేజ ఈ ఏడాది 'క్రాక్' సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో సందడి చేశాడు. అలాగే రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడీ చిత్రం షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. తొలుత ఈ సినిమాని మే 28న విడుదల చేస్తారని ప్రకటించారు. అయితే ఇప్పుడు కరోనాతో పరిస్థితులు మారిపోయాయి. సెకండ్ వేవ్ తో కేసులు భారీగా పెరగడం, రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్ పెట్టే పరిస్థితి ఉండటంతో సినిమా విడుదలను జులై నెలకి వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

'ఖిలాడీ' సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్ సార్జా, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సత్యనారాయణ కోనేరు, రమేశ్ వర్మ ఈ సినిమాను నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

Tags:    

Similar News