Ranga Maarthaanda: కృష్ణవంశీ మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడా..!

* ఒక్క సూపర్ హిట్ కోసం ఎన్నో తంటాలు పడుతున్న కృష్ణవంశీ

Update: 2023-02-09 13:30 GMT
Ranga Maarthaanda Movie Pressure On Krishna Vamsi

రంగు మార్తాండ విషయంలో డైరెక్టర్ కృష్ణవంశీ పై ప్రెషర్

  • whatsapp icon

Krishna Vamsi: ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకరు. కానీ గత కొంతకాలంగా ఒక్క సక్సెస్ కూడా అందుకోలేని కృష్ణవంశీ గురించి ఇప్పుడు చాలామంది మర్చిపోయారు కూడా. కానీ అభిమానులు మాత్రం కృష్ణవంశీ మళ్లీ ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో వస్తే బాగుంటుందని ఎప్పటినుంచో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా రంగమార్తాండ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరాఠీలో సూపర్ హిట్ అయిన నట సామ్రాట్ సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచాడు కృష్ణవంశీ. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ చూస్తే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతో కృష్ణ వంశీ మళ్లీ తన మార్క్ చూపించబోవడం మాత్రం ఖాయమైనట్టే అని అభిమానులు అంటున్నారు.

Tags:    

Similar News