Virata Parvam in Netflix: "లీడర్" చిత్రంతో దగ్గుబాటి కుటుంబం వెంకటేష్ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా దగ్గుబాటి తన కెరీర్లో అటు హీరోగా విభిన్న పాత్రల్లో నటించడమే కాకుండా బాహుబలి వంటి చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల విడుదలైన "అరణ్య" చిత్రంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన రానా అతి త్వరలో మరో విభిన్నమైన పాత్రతో విరాట్ పర్వం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 1990 లో తెలంగాణా ప్రాంతంలో ఉన్న నక్సల్స్ గురించిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. దర్శకుడు వేణు ఉడుగుల వరంగల్ లో తన బాల్యంలో నక్సల్స్ ఎదుర్కున్న పరిస్థితులను ఈ చిత్రంలో చూపించనున్నాడు.
రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విరాటపర్వం యొక్క ట్రైలర్ యూట్యూబ్ కొన్ని రోజుల క్రితమే విడుదల చేసింది చిత్ర యూనిట్. కరోనా కారణంగా సినిమా విడుదల ఆలస్యం అయిన ఈ చిత్ర యూనిట్ మొదట సినిమా థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ వార్తలు, ఆంధ్రాలో 50 అక్యుపెన్సితో థియేటర్స్ కి అనుమతి వంటి కారణాలతో పాటు ఓటీటీ నుండి భారీగా ఆఫర్స్ వస్తుండటంతో చిత్ర నిర్మాత సురేష్ బాబు "విరాటపర్వం" చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయడానికి ఆసక్తి చూపినట్టు తెలుస్తుంది. ఇప్పటికే వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ లో జూలై 20న విడుదల కానున్న సంగతి తెలిసిందే.