Ram Gopal Varma: మరొక బయోపిక్ తో రాబోతున్న రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma: వారు రాజకీయాల్లో ఎలా ఎదిగారు అనే విషయాలు ఈ సినిమా ద్వారా చూపించనున్నారు

Update: 2021-09-26 16:00 GMT
Ram Gopal Varma Ready to do Biopic on Warangal Leaders Konda Murali and Surekha

రామ్ గోపాల్ వర్మ(ఫోటో- ది హన్స్ ఇండియా)

  • whatsapp icon

Ram Gopal Varma: కొందరు దర్శక నిర్మాతలు సినీస్టార్ల మీద లేదా స్వతంత్ర సమరయోధుల మీద బయోపిక్ లు తీస్తుంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం రాజకీయ నాయకుల మీద సినిమాలు తీస్తూ ఉంటారు. తాజాగా ఈ మధ్యకాలంలో కేవలం బయోపిక్ లు మాత్రమే తీస్తున్న ఆర్జీవి ఇప్పుడు మరొక బయోపిక్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసారి రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న బయోపిక్ వరంగల్ లీడర్స్ కొండా సురేఖ మరియు కొండా మురళి మీద. వారి రెబలిజం గురించి తెలియనిది కాదు. ఇప్పుడు వీరి కథని సినిమా గా మార్చడానికి రాంగోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వరంగల్ వెళ్లి వారికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నారు ఆర్జీవి. కొండ మురళి చదువుకున్న కాలేజీలు, కొండా సురేఖ తో అతని పెళ్లి ఎలా జరిగింది, ఆ తర్వాత వారు రాజకీయాల్లో ఎలా ఎదిగారు అనే విషయాలు ఈ సినిమా ద్వారా చూపించనున్నారు వర్మ. కొండా మురళిపై చాలానే ఆరోపణలు ఉన్నాయి.

ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడిగా ఉండే మురళి ఆయనకు ఎదురు తిరిగి ఆయనకు పోటీగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రోత్సహించారు. ఆ తర్వాత పరోక్ష రాజకీయాలు చూసుకున్నా కొండ మురళి వైఎస్ చనిపోయిన తర్వాత టిఆర్ఎస్ లో  చేరారు.

అక్కడ వారిని సరిగా పట్టించుకోవడం లేదు అని చెప్పిన కొండా మురళి ఆపై కాంగ్రెస్ లో చేరారు. ఇక వీరి కథ వెండితెరపై ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News