Ram Charan: రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్-15..!?

"చిరుత" చిత్రంతో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన చరణ్ తను ఇప్పటి వరకు నటించిన 13 చిత్రాలతోనే అభిమానులను సొంతం చేసుకున్నాడు.

Update: 2021-07-01 12:39 GMT

రామ్ చరణ్ (ఫైల్ ఫోటో)

Ramcharan 15: "చిరుత" చిత్రంతో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తను ఇప్పటి వరకు నటించిన 13 చిత్రాలతోనే పెద్ద సంఖ్యలో అభిమానులను మాత్రం సొంతం చేసుకున్నాడు. మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ తన నటనతో రెండో చిత్రం 'మగధీర'తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాసుల వసూళ్ళలో ఒక ట్రెండ్ సెట్ చేసాడు. ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ఆర్ఆర్" చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్న చరణ్ ఈ చిత్ర షూటింగ్ పూర్తి అవగానే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

ఈ చిత్రం ఒక మంచి సోషల్ మెసేజ్ తో పాటు బలమైన రాజకీయ కథ కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో షూటింగ్ పట్టాలు ఎక్కబోతుందని సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నడని సినీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తే మరి కొందరు రాజకీయ నాయకుడిని ప్రశ్నించే ఒక యువకుడిగా కనిపించబోతున్నాడని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Tags:    

Similar News