Ram Charan: కళ్యాణ్ బాబాయ్.. వకీల్‌సాబ్‌లో నీ పాత్ర అలాంటిదే

Ram Charan: వకీల్‌సాబ్‌’పై తన స్పందనని తెలియజేశాడు. వకీల్‌సాబ్ సినిమాలో పాత్ర తనను ఆలోచింపజేసిందని రామ్ చరణ్ అన్నాడు.

Update: 2021-04-10 12:31 GMT
Ramcharan Responds On  Vakeel Sab Movie

రాంచరణ్ పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో 

  • whatsapp icon

Ram Charan: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వకీల్‌సాబ్'. హిందీలో మూవీ పింక్ సినిమా రీమేక్‌గా ఈ మూవీని రూపొందించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి షో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మూడు సంవత్సరాల తర్వాత పవన్‌ని స్క్రీన్‌పై చూడటంతో అభిమానుల సంతోషం ఆకాశాన్ని తాకింది. వకీల్‌సాబ్ చిత్రంపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తమ తల్లి అంజనా దేవితో కలిసి సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ 'వకీల్‌సాబ్‌'పై తన స్పందనని తెలియజేశాడు. వకీల్‌సాబ్ సినిమాలో పాత్ర తనను ఆలోచింపజేసిందని రామ్ చరణ్ అన్నాడు.కొన్ని సినిమాల్లో పాత్రలను మనం ఎంజాయ్ చేస్తూ చూడటమే కాదు.. సినిమా ముగిసిన తర్వాత ఆలోచింపజేస్తాయి. కళ్యాణ్ బాబాయ్.. వకీల్‌సాబ్‌లో నీ పాత్ర అలాంటిదే. ప్రకాశ్ రాజ్ గారు, నివేదా థామస్, అంజలి, అనన్య అద్భుతంగా నటించారు. వకీల్‌సాబ్‌ని మాకు అందించిన వేణు శ్రీరామ్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ రామ్ చరణ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.



Tags:    

Similar News