Ram Charan: మెగాస్టార్ రెమ్యూనరేషన్ పై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్

Ram Charan: మెగాస్టార్ రెమ్యూనరేషన్ పై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్

Update: 2022-04-26 08:45 GMT

Ram Charan: మెగాస్టార్ రెమ్యూనరేషన్ పై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29 న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక క్యామియో పాత్రలో కూడా కనిపించబోతున్నారు. చిరంజీవి ఈ సినిమాలో ఆచార్య పాత్రలో కనిపించబోతుంది రామ్ చరణ్ సిద్ధ పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సినిమా కోసం మెగాస్టార్ రేమ్యూనరేషన్ కింద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటూ రామ్ చరణ్ అందరికీ షాక్ ఇచ్చారు. కథ పైన నమ్మకం మరియు కొరటాల మీద ఉన్న గౌరవంతో మెగాస్టార్ ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని చెప్పాలని రామ్ చరణ్ ప్రయత్నించారు.

కానీ ఆచార్య మెగాస్టార్ హోమ్ ప్రొడక్షన్ నిర్మించిన సినిమా. ఏ హీరో అయినా హోమ్ ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నప్పుడు రెమ్యూనరేషన్ తీసుకోరు. దాని బదులుగా వారు చిత్ర బిజినెస్ లోని కొంచెం ప్రాఫిట్ షేర్ ను తీసుకుంటారు. ఇక ఆచార్య సినిమా హిట్ అయితే దానికి తగ్గ ప్రాఫిట్ కూడా మెగాస్టార్ హోమ్ ప్రొడక్షన్ కే వస్తుంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.

Tags:    

Similar News