Rajinikanth: చెన్నై కావేరీ ఆస్పత్రిలో కోలుకుంటున్న రజనీకాంత్
Rajinikanth: రక్తనాళాల్లో బ్లాక్స్ ను గుర్తించిన వైద్యులు
Rajinikanth: అనారోగ్యంతో నిన్న రాత్రి చెన్నై కావేరీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన తమిళనటుడు, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది.. కళ్లు తిరగడంతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్ కు వైద్య పరీక్షలు జరిపిన వైద్యులు రక్తనాళాల్లో పూడికలున్నట్లు గుర్తించారు ఆ పూడికలను పూర్తిగా తొలగించామని, వైద్యం కొనసాగుతోందని ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందని తెలిపారు రెండురోజుల అనంతరం రజనీకాంత్ ను డిశ్చార్జ్ చేయనున్నట్లు కావేరీ ఆస్పత్రి యాజమాన్యం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది.