హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అవార్డ్ అందుకున్న రజినీకాంత్
Rajinikanth: సూపర్ స్టార్ కు హైయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ అవార్డు
Rajinikanth: ప్రముఖ కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లోనే పరిచయం అక్కర్లేని పేరు. "బాషా", "ముత్తు", "అరుణాచలం", "నరసింహ", "శివాజీ", "రోబో" ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన సూపర్ స్టార్ కోట్ల లో అభిమానులను కూడా గెలుచుకున్నారు. 50 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్న రజినీకాంత్ కు తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఒక కొత్త అవార్డును ప్రకటించింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది. తమిళనాడు రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం పన్ను చెల్లింపుదారుగా రజినీకాంత్ పేరు తెచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇంకమ్ ట్యాక్స్ అధికారులు రజనీకాంత్‌ను అవార్డుతో సత్కరించారు. జూలై 24న చెన్నైలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇంకమ్ ట్యాక్స్ డే సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసై ఈ వేడుక కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విభిన్న రంగాలకు చెందిన వారిలో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన వారికి ఐటి అధికారులు అవార్డులు అందించారు. అందులో రజనీకాంత్ తరఫున ఆయన కుమార్తె ఐశ్వర్య ఈ అవార్డు అందుకున్నారు. సౌత్ లో రజనీకాంత్ అత్యధిక పారితోషికం అందుకుంటారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.